
పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు, స్ట్రోక్ ముప్పును పెంచుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్‌ప్రెజర్‌లో పెరుగుదల ఉంటుదని తెలిపింది. సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించింది. అలారం మోగినప్పుడు అది శరీరంపై ఒత్తిడి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. కార్టిసాల్, అడ్రినలిన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు గుండె వేగంగా కొట్టుకోవడానికి, రక్త నాళాలు కుంచించుకుపోవడానికి కారణమవుతాయి. దీని వలన రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని వెల్లడించింది.
అలారం సౌండ్ రావడంతో అకస్మాత్తుగా మేల్కోవడం నిద్ర జడత్వానికి కారణమవుతుంది. దీని వలన మీరు చాలా సేపటి వరకు బద్ధకంగా, ఏటూ తోచని స్థితిలో ఉంటారు. తగినంత నిద్ర లేకపోవడం (7 గంటల కన్నా తక్కువ) అలారం-ప్రేరిత మేల్కొలుపులతో కలిపి ఉదయం రక్తపోటు పెరుగుదల, సంబంధిత హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని పరిశోధన సూచిస్తుంది.
ఫ్లూట్, వయోలిన్, పియానోలు వంటి మృదువైన వాయిద్య శబ్దాలు పెట్టుకోవాలి. వర్షపు చినుకులు, స్మూత్ జాజ్, వాగు లేదా నది ప్రవహించే శబ్దం, సముద్ర అలలు, పక్షుల కిలకిలరావాల శబ్దం, వర్షారణ్యం శబ్దాలు, అటవీ వాతావరణం వంటి శబ్ధాలను అలారంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. (Source)
నోట్: ఇది కేవలం ఓ కథనం ఆధారంగా రాసిన ఆర్టికల్ మాత్రమే. దీనిని గమనించాల్సిందిగా కోరుతున్నాం. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.