
అరటిపండ్లు తినడం వల్ల బాగా నిద్రపడుతుందని చాలా మంది భావిస్తారు. ఈ పద్ధతి నిజమని భావించి దీనిని అనుసరించే వారు కూడా చాలా మందే ఏన్నారు. ఈ పండులో పొటాషియం , మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు ఉన్నందున ఇది మంచి నిద్రను కలిగించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఎందుకంటే ఈ పోషకాలు శరీరానికి విశ్రాంతినిచ్చి నిద్ర స్థాయిలను పెంచుతాయి. కానీ ఇది నిజమేనా? అరటిపండ్లు తినడం వల్ల నిజంగా బాగా నిద్రపడుతుందా? అనే సందేహం మాత్రం చాలా మందికి ఉంది. దీనిపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఈ పండులో ఉండే ట్రిప్టోఫాన్ శరీరంలో సెరోటోనిన్‌ను మెలటోనిన్‌గా మార్చి, మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుందని.. అలాగే, పొటాషియం, మెగ్నీషియం కండరాలను సడలించి ఒత్తిడిని తగ్గిస్తాయని పలువురి నమ్మకం. ఈ కారణాల వల్ల రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల నిజంగానే బాగా నిద్ర వస్తుందని నిపుణులు అంటున్నారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, అరటిపండ్లు తినడం వల్ల బాగా నిద్ర పట్టవచ్చు. కానీ ఇది అందరికీ వర్తించదు. అందరికీ ఒకే విధంగా ఇది పనిచేయదు. వారి ఆహారం, నిద్ర వాతావరణం, వ్యక్తిగత జీవనశైలి వారి నిద్ర నాణ్యతను బాగా ప్రభావితం చేస్తాయి. కొంతమందికి అరటిపండ్లను తక్కువ మొత్తంలో తినడం వల్ల కొంత ప్రయోజనం లభిస్తుంది. నిద్ర మాత్రలు వేసుకునే వారికి కూడా ఇది మంచిది. ప్రతిరోజూ మాత్రలు వేసుకుని నిద్రపోవడం మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా అరటిపండ్లు తినడం వల్ల నిద్ర సహజంగా వస్తుందని పేర్కొంది.
అరటిపండ్లు ఆరోగ్యకరమైన ఆహారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాత్రిపూట తినడం వల్ల ఎటువంటి హాని జరగదు. కానీ నిద్ర సమస్యలకు పరిష్కారంగా దాన్ని పూర్తిగా నమ్మకూడదు. అంతేకాకుండా ఇది అందరికీ అనుకూలంగా ఉండదు. సమతుల్య ఆహారం, క్రమమైన షెడ్యూల్, ఒత్తిడి లేని మనస్సు అన్నీ మంచి రాత్రి నిద్రకు చాలా ముఖ్యమైనవి. మీరు దీనిని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.