AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవునా.. నిజమా..? చల్లటి నీళ్లు తాగితే జరిగేది ఇదేనట! డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వర్షాకాలం లేదా చలికాలం రాగానే ఇంట్లోని పెద్దలు మొదట చెప్పే మాట ఫ్రిజ్ నీళ్లు తాగొద్దు, ఐస్ క్రీమ్ తినొద్దు.. జలుబు చేస్తుంది అని. చిన్నప్పటి నుండి మనందరం ఈ మాట వింటూ పెరిగాం. మరి చల్లటి నీరు తాగడం వల్ల నిజంగానే జలుబు చేస్తుందా? విజ్ఞాన శాస్త్రం, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? నిజమైన కారణం.. నీరు కాదు, వైరస్ అంటున్నారు..!పూర్తి వివరాల్లోకి వెళితే..

అవునా.. నిజమా..? చల్లటి నీళ్లు తాగితే జరిగేది ఇదేనట! డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Can Cold Water Cause Cough
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2026 | 3:12 PM

Share

చల్లటి నీరు లేదా ఫ్రిజ్ నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందనేది తరతరాలుగా మనం వింటూనే ఉన్నాం..వైద్యశాస్త్రం ప్రకారం, చల్లటి నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాదు. సాధారణ జలుబుకు లేదా ఫ్లూకి అసలైన కారణం రైనోవైరస్ వంటి సూక్ష్మజీవులు అంటే వైరస్‌లు. ఈ వైరస్‌లు గాలి ద్వారా తుమ్ములు, దగ్గు లేదా సోకిన వ్యక్తి తాకిన వస్తువులను తాకినప్పుడు మాత్రమే మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం తాగే నీటి ఉష్ణోగ్రతకు, జలుబు ఇన్ఫెక్షన్ రావడానికి ఎటువంటి సంబంధం లేదు.

మరి చల్లటి నీరు తాగినప్పుడు గొంతులో తేడా ఎందుకు వస్తుంది?:

మనోళ్లకు ఈ అనుమానం రావడం వెనుక ఒక చిన్న కారణం ఉంది. మీకు ఇదివరకే గొంతులో స్వల్పంగా ఇన్ఫెక్షన్, అలర్జీ లేదా నొప్పి ఉంటే, అప్పుడు చల్లటి నీరు తాగినప్పుడు గొంతులోని రక్తనానాలు తాత్కాలికంగా సంకోచిస్తాయి. దీనివల్ల స్థానికంగా ఉన్న రోగనిరోధక శక్తి తాత్కాలికంగా తగ్గి గొంతు కిరికిరి లేదా అస్వస్థతగా అనిపించవచ్చు. అంటే, ఇది ఉన్న లక్షణాలను కొద్దిగా ఎక్కువ చేస్తుంది తప్ప, కొత్తగా జలుబును సృష్టించదు.

చలికాలంలో/వర్షాకాలంలో జలుబు ఎందుకు ఎక్కువగా వస్తుంది?:

చల్లటి నీరు తాగడం వల్ల కాకుండా, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వైరస్‌లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. పైగా ప్రజలంతా ఇళ్లలోనే కలిసి సమయం గడపడం వల్ల ఒకరి నుండి ఒకరికి వైరస్ సులభంగా సోకుతుంది. దీన్ని చాలామంది చల్లటి నీటికి లింక్ చేస్తారు.. కానీ అసలు నేరస్థుడు వైరస్ మాత్రమే.

ఇవి కూడా చదవండి

జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?:

సబ్బుతో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.

జలుబు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కొద్దిగా దూరంగా ఉండాలి.

రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి రోజూ సమతులాహారం, తగినంత నిద్ర అవసరం.

శరీరానికి తగినంత నీటిని తాగాలి. చల్లటి నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందనేది ఒక వైద్యపరమైన అపోహ మాత్రమే. మీ ఆరోగ్యం బాగున్నంత వరకు చల్లటి నీరు తాగడంలో ఎలాంటి ప్రమాదం లేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us