Bath towels: బాత్ టవల్స్ పై ఈ ప్రత్యేక గీతలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

మనం స్నానం చేసినా, మొహం కడుకున్నా తూల్చుకోవడానికి కచ్చితంగా టవాల్స్‌ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. దీంతో ఈ టవాల్స్ అనేవి మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయాయి. అయితే ఈ టవాళ్లపై మీరు కొన్ని చారలను గమినించి ఉంటారు. ఇంతకు ఆ చాలు ఏమిటి, టవాల్స్‌ను అలా ఎందుకు డిజైన్ చేస్తారో మీకు తెలిసా. అయితే తెలుసుకుందాం పదండి .

Bath towels: బాత్ టవల్స్ పై ఈ ప్రత్యేక గీతలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?
Dobby Border

Updated on: Dec 14, 2025 | 5:58 PM

ప్రతి ఇంట్లో కచ్చితంగా టవాల్స్ ఉంటాయి. ఎందుకంటే మనం స్నానం చేసినా, మొహం కడుకున్నా తుడుచుకోవడానికి వాటిని వాడుతూ ఉంటాం. దీంతో ఈ టవాల్స్ అనేవి మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయాయి. అయితే ఈ టవాళ్లపై మీరు కొన్ని చారలను గమినించి ఉంటారు. ఇంతకు ఆ చాలు ఏమిటి, టవాల్స్‌ను అలా ఎందుకు డిజైన్ చేస్తారో అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా. అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా టవాల్స్ రెండు అంచులలోని ఈ చారలు ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం గట్టిగా బెల్ట్‌ టైప్ ఉంటుంది. ఈ చారను డాబీ బోర్డర్ అంటారు. ఇది టవల్ అంచులలో కనిపించే ఒక ప్రత్యేక రకం డిజైన్. ఈ బోర్డర్ టవల్ డిజైన్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. ఇది టవల్ అంచులకు రక్షణగా కూడా పనిచేస్తుంది. అలాగే దారాలు చిరిగిపోకుండా అడ్డుకుంటుంది.

టవర్ చిరిగిపోకుండా రక్షించడం: టవల్ చుట్టూ ఉన్న ఈ బ్యాండ్ లేకుంటే టవల్‌లో ఉండే పోగులు త్వరగా చిరిగిపోయే అవకావం ఉంటుంది. దీనిని అరికట్టేందుకు తయారీ దారులు ఒక పట్టీలాంటి డిజైన్‌ను టవాల్‌ అంచుల్లో ఏర్పాటు చేస్తారు. ఇంది టవల్‌ చినిగిపోకుండా రక్షించడతో పాటు.. పటల్‌ పట్టును బలపరుస్తుంది. మీరు ఒక వేళ టవల్‌ను గట్టిగా పిండేసినా లేదా పదే పదే ఉతికినా, అది చిరిగిపోకుండా సహాయపడుతుంది.

ఇది నీటి శోషణకు: టవల్ మీద ఉన్న ఈ స్ట్రిప్ చూడ్డానికి కొంచెం అసాధారణంగా అనిపించవచ్చు, కానీ శరీరంపై తడి లేకుండా పూర్తిగా నీటిని పీల్చుకునేందుకు సహాయపడుతుంది. అలాగే ఎన్నిసార్లు ఉతికినా టవన్ త్వరగా పాడవకుండా ఉండడానికి నిరోదిస్తుంది.అలాగే ఇది టవల్‌కు అందమైన రూపాన్ని ఇస్తుంది. టవల్ పై ఉన్న గీత దాని రూపాన్ని పెంచుతుంది. ఇది టవల్ ను సాదాగా కాకుండా స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.