వార్నీ.. మందు, సిగిరెట్లకు బానిసగా మారడానికి అసలు కారణం ఇదేనంట.. మ్యాటర్ తెలిస్తే షాకే..
చాలా మంది మందు, సిగరేట్ లేకుండా ఉండలేరు. వాటిలో మునిగి తేలుతారు. అవి ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా విడిచిపెట్టారు. మత్త వల్ల ఎంతో మంది జీవితాలు చిత్తు అయ్యాయి. అయితే ఇలా చెడు అలవాట్లకు బానిసలు కావడానికి కారణం ఏంటోమీకు తెలుసా..? తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సంతోషమైనా, బాధైనా మందు తాగడం కామన్‌గా మారింది. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడగా.. ఎంతో మంది జీవితాలు ఛిద్రమయ్యాయి. ఇటు ప్రభుత్వాలకు కూడా మందు, సిగరెట్ల పైనే ఆదాయం ఎక్కువ. మద్యం సేవించడం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ వాటిని తీసుకోవడం ఆపరు. సరదా కోసం సిగరెట్లు, మందు తాగుతారు. ఒత్తిడి టెన్షన్‌లో ఉన్నవాళ్లైతే మందులో మునిగి తేలుతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ ప్రజలు ఎందుకు మానరు..? చెడు అలవాట్లకు ఎందుకు బానిసలవుతారు? అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కొంతమంది సరదా కోసం మద్యం, సిగరెట్లు తీసుకోవడం ప్రారంభించి వాటికి పూర్తిగా బానిసలవుతారు. కానీ ఒకసారి ఈ చెడు అలవాట్లకు బానిసలైతే, దాని నుండి బయటపడటం చాలా కష్టం. మాదకద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అటువంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారడానికి ప్రధాన కారణం మన శరీరంలోని RASGRF-2 మూలకం. ఏదైనా పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాని నుంచి లభించే ఆనందాన్ని ఆస్వాదించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మద్యం సేవించేటప్పుడు, ధూమపానం చేసేటప్పుడు లేదా ఏదైనా ఔషధాన్ని తీసుకునేటప్పుడు RASGRF-2 ఎక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆనందానికి కారణమయ్యే హార్మోన్. ఈ కారణంగా ప్రజలు మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు, వారి బాధలను మరచిపోయి మరింత సంతోషంగా ఉంటారు.
RASGRF2 అంటే.?
RASGRF2.. రాస్-స్పెసిఫిక్ గ్వానైన్ న్యూక్లియోటైడ్-రిలీజింగ్ ఫ్యాక్టర్ 2 అని కూడా పిలుస్తారు. ఇది న్యూరోనల్ సిగ్నలింగ్, T-సెల్ యాక్టివేషన్, ట్యూమర్ సెల్ ప్రవర్తనతో సహా వివిధ సెల్యులార్ ప్రక్రియలను నియంత్రించడంలో ప్రధాన పోషిస్తుంది. ఇది గ్వానైన్ న్యూక్లియోటైడ్ ఎక్స్ఛేంజ్ ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది.
డోపమైన్ ఏం చేస్తుంది..?
మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు ఈ డోపమైన్ రసాయనం తాత్కాలికంగా మనస్సుకు ఆనందాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఈ ఆనందాన్ని మళ్లీ మళ్లీ అనుభవించాలనే కోరిక వాటి వెంట పరుగెత్తేలా చేస్తుంది. ఆ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. వీటిని తినడం వల్ల లభించే క్షణిక ఆనందం కోసం తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఈ చెడు అలవాట్లకు అలవాటైతే వాటి నుండి బయటపడటం చాలా కష్టం. అందుకే జీవితాన్ని నాశనం చేసే ఈ అలవాటుకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…




