Diabetes: మధుమేహం పురుషుల్లోనే అధికం.. ఎందుకో తెలుసా.?

|

Jul 29, 2024 | 9:59 AM

ఇదిలా ఉంటే డయాబెటిస్‌ బారిన పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన కారణాల్లో తీసుకునే ఆహారం ఒకటైతే, శారీరక శ్రమతగ్గడం. ఈ కారణంగానే ఊబకాయం, షుగర్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. మధుమేహం బారిన పడే వారిలో అత్యధికులు పురుషులే ఉంటారు. ఇంతకీ మహిళలతో పోల్చితే పురుషుల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది.?

Diabetes: మధుమేహం పురుషుల్లోనే అధికం.. ఎందుకో తెలుసా.?
Diabetes
Follow us on

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌ డయాబెటిస్‌కు కేంద్రంగా మారుతోంది. దేశంలో రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారుతోన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా డయాబెటిస్‌ బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది, కానీ ప్రస్తుతం 30 ఏళ్ల వారికి కూడా డయాబెటిస్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే డయాబెటిస్‌ బారిన పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన కారణాల్లో తీసుకునే ఆహారం ఒకటైతే, శారీరక శ్రమతగ్గడం. ఈ కారణంగానే ఊబకాయం, షుగర్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. మధుమేహం బారిన పడే వారిలో అత్యధికులు పురుషులే ఉంటారు. ఇంతకీ మహిళలతో పోల్చితే పురుషుల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది.? అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషుల్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం బారినపడుతున్నారు. దీని కారణంగా, ప్యాంక్రియాస్ పనితీరుపై ప్రభావం పడుతుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరిగినప్పుడు, శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేవు, దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కూర్చొని చేసే పనులు ఎక్కువ కావడంతో షుగర్‌ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

పురుషుల్లో ఎక్కువగా కొవ్వు కడుపు చుట్టూ నిల్వ అవుతుంది. అదే మహిళల్లో అయితే తొడలు, తుంటిలో నిల్వ ఉంటుంది. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడం ప్రేగుల పనితీరును ప్రభావితం చేస్తుంది, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది మధుమేహానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అందుకే పురుషుల్లో ఈ మధుమేహం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల కంటే పురుషులు తక్కువ ఇన్సులిన్ సెన్సిటివిటీని కలిగి ఉంటారు. అంటే, వారి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తుంది, దీంతో మధుమేహం ప్రమాదం పెరుగుతంది.

ఇక పురుషుల్లో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా రావడానికి కారణాల్లో జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల మీ కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే, అది మీ జన్యువులలో కూడా ప్రభావం పడుతుంది. అందుకే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. నిత్యం హెల్త్‌ చెకప్స్‌ చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..