Omelette : మీకు అల్పాహారం కావాలనుకున్నప్పుడు గుడ్లు చాలా బాగా ఉపయోగపడుతాయి. వాటిని ఉడకబెట్టడం లేదా సగం వేయించుకొని తినవచ్చు. కానీ ఆమ్లెట్ తయారుచేసే విషయానికి వస్తే చాలా మంది ఆమ్లెట్ బెంచ్ మార్కును చేరుకోలేరు. రుచికరమైన ఆమ్లెట్ తయారుచేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఆమ్లెట్ విభాగంలో పదికి పది స్కోరు సాధించాలంటే ఈ 5 చిట్కాలను తెలుసుకోవాలి.
1. ఆమ్లెట్ తయారుచేసేటప్పుడు కొద్ది మొత్తంలో పాలు లేదా క్రీమ్ కలపాలి. ఇది ఆమ్లెట్ మెత్తగా రావడానికి సహాయపడుతుంది.
2. మీరు గుడ్లు జోడించే ముందు పాన్ మీద కరిగించిన వెన్న వాడాలి. వేడిచేసిన వెన్న నుంచి బుడగలు పోయిన తర్వాతే గుడ్లను పాన్లో చేర్చాలి.
3. మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే గుడ్డు తెల్లగా, పచ్చసొన చిక్కబడే వరకు విడిగా వేయాలి. తరువాత ఉప్పు, మిరియాలు వంటివి వేయాలి.
4. ఆమ్లెట్ తయారు చేయడానికి సాదా కార్బోనేటేడ్ నీరు లేదా సోడా నీటిని గుడ్లలో చేర్చడం మరొక ఉపాయం.
5. ఎక్కువ హెవీ టాపింగ్స్‌ను జోడించకుండా ప్రయత్నించండి. జున్ను, టమోటాలు , పుట్టగొడుగులు లేదా ఉల్లిపాయలు వంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల తేలికగా, మెత్తగా ఉంటుంది.
6. మీరు ఆమ్లెట్‌ను సాయంత్రం అల్పాహారంగా తీసుకోవచ్చు. వివిధ సుగంధ ద్రవ్యాలు చల్లుకోవటం ద్వారా మంచి రుచి వస్తుంది.