Sleep divorce: పెరుగుతోన్న ‘స్లీప్‌ డైవర్స్‌’ ట్రెండ్‌.. ఏంటీ నిద్ర విడాకులు..

|

Nov 08, 2024 | 7:04 PM

ప్రస్తుతం ఓ విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. స్లీప్‌ డైవర్స్‌ పేరుతో ఓ కొత్త ట్రెండ్‌ను ఎక్కువుతోంది. రాత్రుళ్లు జంటలు కలిసి పడుకునే ట్రెండ్ తగ్గుతోంది. దీనిని నిద్ర విడాకులుగా చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ట్రెండ్‌..? దీనివల్ల కలిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sleep divorce: పెరుగుతోన్న స్లీప్‌ డైవర్స్‌ ట్రెండ్‌.. ఏంటీ నిద్ర విడాకులు..
Sleep Divorce
Follow us on

కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి సైతం మారుతోంది. చిత్రవిచిత్రమైన కొంగొత్త పోకడలు వస్తున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డైవర్స్‌. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

సాధారణంగా భార్యభర్తలు అంటే కలిసి పడుకుంటారు. దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే కలిసి పడుకోవాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే ఇటీవల స్లీప్‌ డైవర్స్‌ ట్రెండ్ పెరుగుతోంది. అంటే కలిసి కాకుండా విడివిడిగా పడుకోవడం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్‌పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడమే ఈ స్లీప్‌ డైవర్స్‌ ట్రెండ్.

భాగస్వాముల నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మంచి నిద్ర పొందడానికే వేర్వేరుగా నిద్రిస్తున్నారు. దీనినే నిద్ర విడాకులుగా అభివర్ణిస్తున్నారు. నిద్రలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా వేరు వేరుగా పడుకుంటున్నారు. అందుకే ఈ నిద్ర విడాకులు కేవలం తాత్కలికమేనని చెబుతున్నారు. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్ ఫోన్‌ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంభిస్తున్నారు.

అయితే ఈ స్లీప్‌ డైవర్స్‌ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్‌ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..