Banana: పరగడుపున అరటి పండు తింటే ఏమవుతుంది.. లాభమా.. నష్టమా..?

|

Sep 28, 2024 | 8:01 AM

అరటి పండులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్, ట్రిప్టోపాన్ లాంటివి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారి నుంచి మొదలు, మెరుగైన జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు కంట్రోల్‌లో ఉండడానికి ఇలా చెప్పుకుంటూ పోతే.. అరటితో కలిగే లాభాలు ఎన్నో. అయితే అరటి పండును ఎప్పుడు తీసుకోవాలనే...

Banana: పరగడుపున అరటి పండు తింటే ఏమవుతుంది.. లాభమా.. నష్టమా..?
Banana
Follow us on

సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదంతా కనిపించే పండ్లలో అరటి ఒకటి. అందులోనూ తక్కువ ధరలోనే అందుబాటులో ఉండడంతో చాలా మంది ఫ్రూట్స్ అనగానే అరటి పండ్లకు ప్రాధానత్య ఇస్తారు. కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అరటి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే కచ్చితంగా ప్రతీ రోజూ ఒక్క అరటి పండునైనా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

అరటి పండులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్, ట్రిప్టోపాన్ లాంటివి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారి నుంచి మొదలు, మెరుగైన జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు కంట్రోల్‌లో ఉండడానికి ఇలా చెప్పుకుంటూ పోతే.. అరటితో కలిగే లాభాలు ఎన్నో. అయితే అరటి పండును ఎప్పుడు తీసుకోవాలనే సందేహం చాలా మంది ఉంటుంది. ఇంతకు అరటిని ఏ సమయాల్లో తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

కొందరు అరటి పండ్లను ఉదయం లేవగానే తీసుకుంటారు. ముఖ్యంగా జిమ్‌లు, వాకింగ్‌లకు వెళ్లే వారు ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తుందని అరటిని తింటుంటారు. అయితే పరగడుపున అరటి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిలో ఉండే ఆమ్ల స్వభావం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని పడేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియపై ఒత్తిడిని పెంచి ప్రేగులను చికాకు పెడుతాయని అంటున్నారు.

అయితే అరటిపండ్లను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం చాలా మంచిదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా అరటి పండ్లను తింటారు. అయితే ఇది కూడా మంచి పద్ధతి కాదు. సాధారణంగా రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్‌ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే రాత్రి తింటే శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల దగ్గు ఉన్నవారు రాత్రి తీసుకోకూడదు.

అరటిని ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రేక్‌ ఫాస్ట్‌ లంచ్‌కు మధ్య తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే సాయంత్రం తీసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. సాయంత్రం స్నాక్స్‌లో నూనెలో వేయించిన పదార్థాలు కాకుండా అరటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం ఇన్‌స్టాంట్‌ ఎనర్జీ అందించడంలో అరటి బాగా ఉపయోగపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..