Fennel Water: ఈ సమ్మర్‌లో సోంపు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..

మొన్నటిదాకా మబ్బుగా ఉండే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎండలు మళ్లీ భయపెట్టిస్తున్నాయి. వర్షాలు పడ్డాయి కదా.. ఎండ నుంచి విముక్తి దొరికింది అనుకున్నారు. కానీ ఎండలు వాయించేస్తున్నాయి. ఈ ఎండల్లో బయటకు వెళ్లారంటే.. ఖచ్చితంగా సన్ స్ట్రోక్ వస్తుంది. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందాలని చాలా మంది కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ వంటివి తెగ తాస్తున్నారు. కానీ వాటి వలన శరీరంలో ఇంకా వేడి అనేది..

Fennel Water: ఈ సమ్మర్‌లో సోంపు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
Fennel Water

Updated on: May 30, 2024 | 6:36 PM

మొన్నటిదాకా మబ్బుగా ఉండే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎండలు మళ్లీ భయపెట్టిస్తున్నాయి. వర్షాలు పడ్డాయి కదా.. ఎండ నుంచి విముక్తి దొరికింది అనుకున్నారు. కానీ ఎండలు వాయించేస్తున్నాయి. ఈ ఎండల్లో బయటకు వెళ్లారంటే.. ఖచ్చితంగా సన్ స్ట్రోక్ వస్తుంది. ఈ ఎండ నుంచి ఉపశమనం పొందాలని చాలా మంది కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ వంటివి తెగ తాస్తున్నారు. కానీ వాటి వలన శరీరంలో ఇంకా వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఎండ నుంచి తట్టుకోవాలంటే.. శరీరానికి చల్లదనం అనేది కావాలి. కాబట్టి బాడీని కూల్‌ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. సరైన ఆహారంతోనే మనం ఆరోగ్యంగా ఉండగలం. శరీరాన్ని చల్లబరిచేలా చేయడంలో సోంపు చక్కగా హెల్ప్ చేస్తుంది. మరి ఈ సమ్మర్‌లో సోంపు వాటర్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో వేడిని తగ్గిస్తుంది:

రాత్రంతా నానబెట్టిన సోంపు నీటిని తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది. శరీరంలో ఉండే వేడిని తగ్గించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎండ నుంచి ఉపశమనం ఇస్తుంది. సోంపు నీటిని ఎలా అయినా తీసుకోవచ్చు.

జీర్ణ సమస్యలు మాయం:

సోంపును తిన్నా.. సోంపు నీటిని తాగినా జీర్ణ సమస్యలు అనేవి అస్సలు ఉండవు. ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవు. చిన్న పిల్లకు కూడా ఈ నీటిని పట్టించవచ్చు.

ఇవి కూడా చదవండి

బెస్ట్ వెయిట్ లాస్:

సోంపు నీటిని తాగడం వల్ల సులభంగా వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఈ సోంపు నీటిలో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అంతే కాకుండా సోంపు వాటర్ తాగితే ఫుడ్ క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. శరీరంలో ఉండే ట్యాక్సిన్స్‌ని కూడా దూరం చేస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి:

సోంపు నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఇన్ ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతాయి. ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..