Three Dry Fruits : ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలమైన ఆహారాన్ని తిని రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. మన శరీరంలో ఎంతో కొంత శక్తి ఉంటేనే మనం తీసుకునే మందులైనా, వేసుకునే ఇంజెక్షన్‌లు అయినా శరీరానికి పనిచేస్తాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంతో పాటు ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ను కూడా డైట్‌లో చేర్చాలి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే పోషకాలు ఉంటాయి. అవి కొంచెం ఖరీదైనవే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అవి కచ్చితంగా అవసరం. నట్స్‌లో అధిక న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్, డైటరీ ఫైబర్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇవి అవసరమైన పోషకాలను కలిగి ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి. అప్పుడే మనం వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం ఉండదు.
1. హాజెల్ నట్స్
ఇందులో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా అవసరమైన ఖనిజలవణాలు ఉంటాయి. హాజెల్ నట్ లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తపోటును రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.
2. వాల్ నట్స్
కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వాల్ నట్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి గట్ లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచి మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.
3. పిస్తా
పిస్తాలు తినడానికి రుచిగా ఉంటాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి వివిధ రకాల గుండె జబ్బులను నివారిస్తాయి. అలాగే మలబద్దకంపై పోరాడటానికి, మీ గట్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే అధిక సంఖ్యలో డైటరీ ఫైబర్స్ ను కలిగి ఉంటాయి.