Diabetes Risk Foods: మీకు షుగర్ ఉందా.. ఈ ఆహారాలు తింటే ఒక్కసారిగా పెరిగిపోతాయి!

ప్రస్తుత కాలంలో డయాబెటీస్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. భారత దేశంలో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. డయాబెటీస్ ఉన్నవారు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి.. డయాబెటీస్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు తినే ఆహారం సరైన విధంగా..

Diabetes Risk Foods: మీకు షుగర్ ఉందా.. ఈ ఆహారాలు తింటే ఒక్కసారిగా పెరిగిపోతాయి!
Diabetes

Updated on: May 29, 2024 | 3:08 PM

ప్రస్తుత కాలంలో డయాబెటీస్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. భారత దేశంలో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. డయాబెటీస్ ఉన్నవారు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి.. డయాబెటీస్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు తినే ఆహారం సరైన విధంగా ఎంపిక చేసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తిన్న తర్వాత.. కేవలం 15 నుంచి 30 నిమిషాలకే రక్తంలో చక్కెరను వేగంగా పెంచేస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి.

తేనె:

డయాబెటీస్ ఉన్నవారు తేనె తీసుకోవచ్చని చెబుతారు. వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు అనుకుంటారు. కానీ తేనె తీసుకున్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరిగిపోతాయి. సహజ సిద్ధంగా లభ్యమైన తేనె చాలా మంచిది. కానీ ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే తేనె తేనెలో కూడా ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఇవి తేనెలో అధికంగా ఉంటాయి. తేనె తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి ఎంతో కొంత ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు చాలా తక్కువ మొత్తంలో తేనె తీసుకోవాలి.

చెరకు గడలు:

నేచురల్ తీపిని కలిగి ఉన్న ఆహారాల్లో చెరకు గడలు కూడా ఒకటి. ఇవి సహజ సిద్ధంగానే తీపి రుచిని కలిగి ఉన్నా.. ఇందులో సూక్రోజ్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కూడా వీటిలో నిండుగా ఉంటాయి. కాబట్టి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై దాని ప్రభావం విపరీతంగా పడుతుంది. దీంతో డయాబెటీస్ లెవల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కూరగాయలు:

కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్నింటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బంగాళ దుంపలు, బఠానీ, మొక్కజొన్న వంటి వాటిల్లో ఎక్కువగా పిండి పదార్థం ఎక్కువగా లభిస్తుంది. వీటిని కనుక తరచూ ఎక్కువగా తింటే.. షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

ఫాస్ట్ ఫుడ్:

ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల డయాబెటీస్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, పీజ్జాలు, బర్గలు, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్, ఫ్రైలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఎందుకంటే వీటిల్లో కార్బోహైడ్రేట్లు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..