AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking-Alcohol: మీకు స్మోకింగ్, మద్యం అలవాటు ఉందా.. వెంటనే గుడ్ బై చెప్పేయండి, ఎందుకంటే

మీరు తరచుగా సిగరెట్స్ తాగుతున్నా.. ఇక అదేపనిగా మద్యం సేవిస్తున్నారా.. అయితే మీరు డేంజర్లో పడట్టే.  ఆల్కహాల్ రెగ్యులర్ గా తాగితే కచ్చితంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. స్మోగింగ్, మితిమీరిన మద్యపానం అలవాటు వల్ల మొత్తం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు తేల్చి చెప్పారు.

Smoking-Alcohol: మీకు స్మోకింగ్, మద్యం అలవాటు ఉందా.. వెంటనే గుడ్ బై చెప్పేయండి, ఎందుకంటే
Wine
Balu Jajala
|

Updated on: Mar 20, 2024 | 1:57 PM

Share

మీరు తరచుగా సిగరెట్స్ తాగుతున్నా.. ఇక అదేపనిగా మద్యం సేవిస్తున్నారా.. అయితే మీరు డేంజర్లో పడట్టే.  ఆల్కహాల్ రెగ్యులర్ గా తాగితే కచ్చితంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. స్మోగింగ్, మితిమీరిన మద్యపానం అలవాటు వల్ల మొత్తం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ముఖ్యంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు.. కానీ దాని వల్ల కళ్లకు కూడా సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఈ రెండు అలవాట్ల వల్ల కళ్ళు పొడిబారడం, దృష్టి లోపానికి నష్టానికి దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ధూమపానం వల్ల కళ్లలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయని గురుగ్రామ్ లోని మారెంగో ఏషియా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజీ డాక్టర్ ధీరజ్ గుప్తా చెప్పారు. అంతేకాక స్మోకింగ్ వల్ల కంటిలో ధమనుల అవరోధాలకు కారణమవుతుంది, ఇది తీవ్రమైన దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీస్తుంది” అని ఆయన చెప్పారు. ఇక స్మోకింగ్ వయస్సుపై కూడా ప్రభావం చూపుతుంది.

అయితే మద్యం తీసుకోవడం వల్ల కళ్ల నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేయడంలో కీలకమైన ఆప్టిక్ నరాలకి హాని కలిగిస్తుందని నిపుణులు గుర్తించారు. నిరంతరం మద్యం సేవించడం ఆప్టిక్ నరాల క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా చూపు ప్రభావం పడుతుంది. ఇక క్రమం తప్పకుండా మద్యం సేవించడం వల్ల కంటిశుక్ల సమస్యలు పెరుగుతాయి. మొత్తంమీద కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానం మరియు మద్యపానం రెండింటినీ తగ్గించడం అవసరం అని నిపుణులు చెప్పారు.

Follow Us