
చాలా మంది హైపర్ పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ముఖంపై నల్ల మచ్చలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నల్ల మచ్చలు అక్కడక్కడా ఉంటాయి. మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఈ పిగ్మెంటేషన్‌కు అనేక కారణాలు ఉన్నాయి. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, సూర్య రశ్మి కిరణాలు, గాయాలు, ఎక్కువగా మెడిసిన్ వాడటం వల్ల ఈ పిగ్మెంటేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. హైపర్ పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి అనేక రకాల చికిత్సలు ఉన్నా.. దీన్ని ఇంట్లోనే నేచురల్ టిప్స్‌తో కూడా తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసే ఈ స్క్రబ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి.. చర్మం రంగును మెరుగు పరచడానికి బాగా సహాయ పడతాయి. మరి అవేంటి? ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.
పసుపు – పాలులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మం మీద ఉండే మచ్చలను తొలగించడమే కాకుండా.. స్కిన్ టోన్‌ని కూడా మెరుగు పరుస్తుంది. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. పాలలో కొద్దిగా పసుపు కలిపి.. ముఖం అంతా పట్టించి.. సున్నితంగా మర్దనా చేయండి. ఈ ప్యాక్ ఆరిపోయాక గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఓట్మీల్ చర్మాన్ని అందంగా మార్చడంలో బాగా సహాయ పడుతుంది. ఓట్మీలో మృత కణాలను తొలగించి.. స్కిన్ మెరిసేలా చేస్తుంది. రక్త ప్రసరణనుకూడా పెంచేందుకు సహాయ పడుతుంది. అలాగే తేనెలో నేచురల్ మాయిశ్చరైజర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు.. ఇన్ ఫెక్షన్లు రాకుండా చేసేందుకు హెల్ప్ చేస్తాయి.
ఓట్మీల్‌ను మెత్తని పొడిలా చేసుకుని.. ఇందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. సున్నితంగా మర్ధనా చేయండి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కా పాటించడం వల్ల మీ చర్మం మీద ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా మీకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు హైపర్ పిగ్మేంటేషన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఈ టిప్స్‌ను వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.