Asana For Relaxation: గ‌జిబిజి లైఫ్‌తో ఒత్తిడికి గుర‌వుతున్నారా.? ఈ సింపుల్ ఆస‌నం ట్రై చేయండి.. వెంట‌నే ఫ‌లితం..

|

May 06, 2021 | 6:04 AM

Asana For Relaxation: ప్ర‌స్తుత రోజుల్లో మ‌నిషి జీవితం పూర్తిగా యాంత్రికంగా మారిపోయింది. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వర‌కు క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ర‌క‌ర‌కాల...

Asana For Relaxation: గ‌జిబిజి లైఫ్‌తో ఒత్తిడికి గుర‌వుతున్నారా.? ఈ సింపుల్ ఆస‌నం ట్రై చేయండి.. వెంట‌నే ఫ‌లితం..
Shavasana Uses
Follow us on

Asana For Relaxation: ప్ర‌స్తుత రోజుల్లో మ‌నిషి జీవితం పూర్తిగా యాంత్రికంగా మారిపోయింది. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వర‌కు క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ర‌క‌ర‌కాల ప‌నుల ఒత్తిళ్ల‌లో న‌లిగిపోతున్నారు. శారీర‌క శ్ర‌మ కంటే ఎక్కువ‌గా మాన‌సిక శ్ర‌మ‌తో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో ఒత్తిడి బాగా పెరుగుతోంది. అయితే ఈ ఒత్తిడికి యోగాతో చెక్ పెట్ట‌వెచ్చ‌నే విష‌యం మీకు తెలుసా.? ఇటీవ‌లి కాలంలో యోగాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరుగుతోంది. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు యోగాతో చెక్ పెట్టే అవ‌కాశం ల‌భిస్తుంది. మ‌రి యాంత్రిక జీవితంలో ఏర్ప‌డే ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి శ‌వాస‌నం ట్రై చేయండని యోగా నిపుణులు చెబుతున్నారు.
పేరుకు త‌గిన‌ట్లే ఈ ఆస‌నంలో పూర్తిగే అచేన స్థితిలో ఉండాలి. అందుకే దీనికి శ‌వాస‌నం అని పేరు. అంటే మ‌నిషి పూర్తిగా త‌న శ‌రీర అవ‌య‌వాల‌ను చ‌ల‌నం లేకుండా రిలాక్స్ కావ‌డ‌మే ఈ ఆస‌నం ముఖ్య ఉద్దేశం. ఈ ఆస‌నంలో భాగంగా.. ముందుగా వెల్లకిలా పడుకోని కాళ్లు, చేతులు దూరంగా ఉంచాలి. చేతులు, కాళ్లుని కదలనివ్వకుండా కళ్లు మూసుకొని దృష్టి అంతటిని శరీరం మీద ఉంచాలి. శ్వాసని నెమ్మదిగా పీలుస్తూ, వదులుతూ ఉండాలి. ఈ ఆసనం వ‌ల్ల‌ శరీరంలోని అన్ని అవయవాలు విశ్రాంతి పొంది మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా అల‌స‌ట‌, ఒత్తిడి దూర‌మై మాన‌సిక ప్ర‌శాంత‌త మీ సొంత‌మ‌వుతుంది.

Also Read: చింతపండు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..! ఎవరు తినొచ్చు.. ఎవరు తినకూడదు..? తెలుసుకోండి..

కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?

అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!