Tips for Banana Fresh: అరటి పండ్లు పాడవకుండా.. ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

|

Oct 12, 2024 | 4:02 PM

అరటి పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారత దేశంలో అందరూ ఎక్కువగా తినేది అరటి పండునే. అరటి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. పేదవాడి పండుగా అరటి పండును పిలుస్తారు. అరటి పండు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడతాయి. బాడీకి తక్షణ శక్తిని అందిస్తుంది. అందుకే చాలా మంది అరటి పండును బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం అరటి పండు..

Tips for Banana Fresh: అరటి పండ్లు పాడవకుండా.. ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
Banana
Follow us on

అరటి పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారత దేశంలో అందరూ ఎక్కువగా తినేది అరటి పండునే. అరటి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. పేదవాడి పండుగా అరటి పండును పిలుస్తారు. అరటి పండు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడతాయి. బాడీకి తక్షణ శక్తిని అందిస్తుంది. అందుకే చాలా మంది అరటి పండును బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం అరటి పండు తింటే రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. పిల్లలకు ఇవ్వడం వల్ల బలంగా, దృఢంగా ఉంటారు. ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ అందాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా అరటి పండు చక్కగా సహాయ పడుతుంది.

కాడలను చుట్టేయండి:

అరటి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కేవలం రెండు, మూడు రోజులకే పాడైపోతాయి. ఇంటికి తెచ్చిన మొదటి రోజు మాత్రమే ఫ్రెష్‌గా ఉంటాయి. అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకురారు. కేవలం అవసరానికి మాత్రమే తీసుకొస్తూ ఉంటారు. అరటి పండు ఫ్రెష్‌గా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అరటి పండు కాడలను ప్లాస్టర్‌తో కవర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటాయి.

వేలాడదీయండి:

అరటి పండ్లు ఎక్కువు రోజులు నిల్వ ఉండాలంటే కింద ఉంచడం కంటే.. పైన వేలాడదీస్తే త్వరగా పాడవ్వకుండా ఉంటాయి. అరటి పండు కాడలకు దారం కట్టి పైన ఎక్కడైనా కట్టండి. ఇలా చేస్తే అరటి పండ్లు త్వరగా పాడు కావు.

ఇవి కూడా చదవండి

ఈ ట్రిక్ బెస్ట్:

మరిన్ని రోజులు అరటి పండ్లు నిల్వ ఉండాలంటే.. విటమిన్ సి ట్యాబ్లెట్ చక్కగా పని చేస్తుంది. విటమిన్ సి ట్యాబ్లెట్‌ని నీటిలో కరిగించాలి. ఇందులో అరటి పండ్లను ఉంచండి. ఈ నీటితో ఫ్రిజ్‌లో కూడా పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల అరటి పండ్లు ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..