Kitchen Hacks: రోటీ పిండి మిగిలిపోయిందని ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా?

మన దేశంలో చాలా మంది అన్నం తరువాత రోటీని ఎక్కువగా తింటారు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రోజూ మూడు పూటల చపాతీలనే తింటూ ఉంటారు. అయితే, ఈ రోటీలు, చపాతీలు చేసుకోవడానికి చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో పిండిని కలుపుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి రెండు, మూడు రోజులకు సరిపడా పిండిని కూడా కలుపుకుని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పిండితో చేసిన చపాతీలు తినటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం...

Kitchen Hacks: రోటీ పిండి మిగిలిపోయిందని ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా?
Chapati Dough

Updated on: Jul 10, 2025 | 6:21 PM

రోజూ చపాతీలు చేయడం అంత ఈజీ కాదు. పిండిని పిసికి కాసేపు పక్కన నానపెట్టి తరువాత వాటిని రోటీలుగా చేసి తర్వాత కాల్చాలి. ఇంత పెద్ద ప్రక్రియ చేసేందుకు చాలా మందికి టైమ్‌ ఉండదు. దాంతో ముందుగానే పిండిని పిసికి ఫ్రిజ్ లో స్టోర్‌ చేసుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు తీసి చపాతీలు చేసుకుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తడిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల కడుపు సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఫ్రిజ్ లో ఎక్కువసేపు నిల్వ ఉంచిన చపాతీ పిండి దాని పోషకాలు, విటమిన్‌లను కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. అంతేకాదు..ఫ్రిజ్ నుండి వచ్చే హానికరమైన వాయువులు చపాతీ పిండిలోకి ప్రవేశించి కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలను కలిగిస్తాయని అంటున్నారు. దాంతో పాటు ఫ్రిజ్ లో ఉంచిన చపాతీ పిండితో చేసిన రోటీ గట్టిగా, పొడిగా ఉంటుంది. కొన్నిసార్లు రుచి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, లిస్టెరియా మోనోసైటోజీన్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఈ చపాతీ పిండిలో పెరుగుతుంది. ఇది జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

అందుకే, ఎప్పుడు చపాతీలు చేసుకోవాలన్న అప్పటికప్పుడే పిండిని కలుపుకోవాలని చెబుతున్నారు. మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచకూడదని సూచిస్తున్నారు. రోటీలు మాత్రమే కాదు.. సాంబార్, రసం, చట్నీ మొదలైన వాటిని కూడా అదే రోజు తయారు చేసి, మిగిలిపోకుండా తినడం మంచిదని అంటున్నారు. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాలు తర్వాత వేడి చేసి తినటం వల్ల శరీరానికి హాని కలిగిస్తుంది. ఆహారం ఎంత తాజాగా ఉంటే, మీ ఆరోగ్యం అంత బాగుంటుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు కూడా ఇలంటి తప్పులు చేస్తున్నట్టయితే, వెంటనే అప్రమత్తంగా ఉండండి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..