Do Not Eat These Foods : రాత్రి సమయంలో చాలా మందికి ఆకలి వేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏది పడితే అది తింటారు. అలా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. రాత్రిపూట ఏమి తినాలి ఏమి తినకూడదు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. పడుకునే ముందు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.
1. జంక్ ఫుడ్
మీరు రాత్రిపూట జంక్ ఫుడ్ తింటే అది మీ నిద్రను పాడు చేస్తుంది. పడుకునే ముందు పిజ్జా వంటి అధిక కొవ్వు ఆహారం తినడం వల్ల బరువు పెరుగుతారు. గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది యాసిడ్‌లను రిప్లెక్ట్ చేస్తుంది. మరుసటి రోజు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది.
2. చాక్లెట్లు
చాక్లెట్‌లో అధిక స్థాయి కెఫిన్ ఉంటుంది. అర్ధరాత్రి అల్పాహారానికి ఇది సరైన ఎంపిక కాదు. ఇది నిద్రరాకుండా నిరోధిస్తుంది. దీని వల్ల శరీరం అలిసిపోయి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
3. ఐస్ క్రీం
అధికంగా చక్కెర తీసుకోవడం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మనందరికీ తెలుసు. కానీ ఇది మన నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఐస్ క్రీం తింటే రాత్రిపూట కార్టిసాల్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్ పై ప్రభావం చూపిస్తుంది. నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.
4. చిప్స్
మీకు రాత్రి ఆకలిగా అనిపిస్తే చిప్స్ ప్యాకెట్‌ను త్వరగా పూర్తి చేయడం చాలా సులభం. కానీ వాటిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. ప్రాసెస్ చేసిన ఆహారంలో పెద్ద మొత్తంలో గ్లూటామేట్ ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
5. టీ
మొత్తంమీద రాత్రి లేదా నిద్రవేళకు ముందు టీ తాగడం మంచిది కాదు. అయితే కొన్ని టీలలో ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడే పదార్థాలు ఉంటాయి. మీరు తీసుకునే టీ పరిమాణాన్ని బట్టి ఇది మారుతుంది. అయితే అన్ని టీలలో కెఫిన్ ఉంటుంది. మీరు నిద్రించడం కష్టమయ్యే ప్రధాన కారణాలలో ఇది ఒకటి. నిద్రపోయే ముందు కెఫిన్ తగ్గించడం ఎల్లప్పుడూ మంచిది.
6. స్వీట్స్
నిద్రకు ముందు స్వీట్స్ తినకూడదు ఎందుకంటే ఇందులో చాలా కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అదే సమయంలో నిద్రపోవడం కష్టం అవుతుంది.