AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు పొడుగ్గా, ఒత్తుగా కావాలంటే.. ఈ హెర్బల్ షాంపూ వాడండి..! మంచి రిజల్ట్ ఉంటుంది..!

జుట్టు పొడవుగా, బలంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అలాంటి జుట్టును సొంతం చేసుకోవడానికి సహజంగా ఇంట్లో తయారు చేసుకునే హెర్బల్ షాంపూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

జుట్టు పొడుగ్గా, ఒత్తుగా కావాలంటే.. ఈ హెర్బల్ షాంపూ వాడండి..! మంచి రిజల్ట్ ఉంటుంది..!
Home Made Shampoo
Prashanthi V
|

Updated on: May 29, 2025 | 10:34 PM

Share

ప్రతి మహిళకూ పొడవుగా, బలంగా, అందంగా ఉన్న జుట్టు కావాలనే కోరిక ఉంటుంది. అలాంటి జుట్టు సాధించాలంటే సహజమైన విధానాలే ఉత్తమం. మార్కెట్లో లభించే రసాయనాలున్న షాంపూలు జుట్టుకి హానికరంగా ఉంటాయి. అందుకే రసాయనాలు లేని సహజ హెర్బల్ షాంపూ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

కావాల్సిన పదార్థాలు

  • శీకాకాయ – 100 గ్రాములు
  • మెంతులు – 20 గ్రాములు
  • రీతా (సోప్‌ నట్‌) – 100 గ్రాములు
  • ఎండిన ఉసిరికాయలు – 100 గ్రాములు
  • కరివేపాకు – 2 కట్టలు
  • వేపాకు – 2 కట్టలు
  • రోజ్‌ మెరీ ఆకులు – 20 గ్రాములు

తయారీ విధానం

ముందుగా శీకాకాయ, రీతా, ఉసిరికాయలు, మెంతులు, కరివేపాకు, వేపాకులను ఒక పెద్ద గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా రాత్రంతా నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి బాగా వస్తాయి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన పదార్థాలను నీటితో సహా మిక్సర్ జార్‌ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఇలా చేయడం వల్ల షాంపూ మంచి చిక్కదనంతో తయారవుతుంది. రుబ్బిన మిశ్రమాన్ని ఒక కడాయిలో వేసి రోజ్‌ మెరీ ఆకులు కూడా కలిపి మధ్యస్థ మంటపై మరిగించాలి. మరిగించడం వల్ల పదార్థాలలోని సహజ గుణాలు మరింత క్రియాశీలమవుతాయి. మరిగించిన తర్వాత ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

ఇలా చల్లారిన తర్వాత మిశ్రమాన్ని ఒక పలుచని వస్త్రం ద్వారా వడకట్టాలి. ఇలా వడకట్టిన పేస్ట్‌ ను నీటితో కలిపి మీకు నచ్చిన విధంగా షాంపూ వలె ఉపయోగించుకోవచ్చు. జుట్టును బట్టి రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి వాడొచ్చు.

ఈ సహజ హెర్బల్ షాంపూ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇది జుట్టుకు కొత్త జీవం పోసి బలహీనపడిన జుట్టును తిరిగి పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లో దొరికే రసాయనాలున్న షాంపూల కంటే ఇది ఎంతో సురక్షితమైనది, ప్రభావవంతమైనది.

ఇలాంటి సహజ పద్ధతులను పాటించడం ద్వారా ఎలాంటి నష్టం లేకుండా బలంగా, పొడవుగా ఉండే జుట్టును పొందవచ్చు. ఆరోగ్యకరమైన, ప్రకృతికి దగ్గరైన ఈ షాంపూను ఉపయోగించి మీ జుట్టుకు కావాల్సిన శక్తిని అందించండి.

(NOTE: ఈ షాంపూ ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)