హిందువులు జరుపుకునే ప్రసిద్ది చెందిన పండగలలో ఒకటి దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలోని అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పండుగను జరుపుకుని ఆనందాన్ని పంచుకుంటారు. దీపావళి సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు వెళ్లి మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దీపావళి సమయంలో చేసే పూజలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, సరస్వతి, గణేశుడిని పూజిస్తారు. దీపాలను వెలిగిస్తారు. పటాకులు పేల్చి సంబరాలు జరుపుకుంటారు. అయితే మీరు కూడా దీపావళి కోసం షాపింగ్ చేయాలనుకుంటే.. అది కూడా తక్కువ ధరకే షాపింగ్ చేయాలనుకుంటే ఢిల్లీలోని ఈ మార్కెట్‌లు చాలా ఉత్తమంగా ఉంటాయి.
చాందినీ చౌక్ టెక్స్‌టైల్ మార్కెట్
ఢిల్లీలోని అతిపెద్ద మార్కెట్లలో చాందినీ చౌక్ మార్కెట్ ఒకటి. తక్కువ బడ్జెట్‌లో దీపావళి షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడకు వెళ్లవచ్చు. తక్కువ ధరలలో బెడ్‌షీట్‌లు, కర్టెన్‌ల్లో అనేక అద్భుతమైన డిజైన్‌లతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ అనేక డిజైన్లలో సోఫా కవర్లు కూడా లభిస్తాయి. చాందినీ చౌక్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో చాలా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఇతర ప్రదేశాలతో పోలిస్తే తక్కువ ధరలతో అందమైన డిజైన్స్ తో కోరుకున్న బెడ్‌షీట్‌లు, కర్టెన్‌లను కొనుగోలు చేయవచ్చు.
పహర్‌గంజ్ మార్కెట్, ఢిల్లీ
దీపావళికి కొనుగోలు చేయడానికి బట్టలు లేదా ఇంటి అలంకరణ వస్తువులు కావచ్చు డిల్లీలో పహర్‌గంజ్ మార్కెట్‌లో సులభంగా ఖరీదు చేయవచ్చు. ఈ మార్కెట్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. పావళికి కొత్త బట్టలు కొనాలన్నా, లైట్లు, అలంకరణ కోసం అనేక ఇతర వస్తువులను కొనుగోలు చేయాలన్నా ఈ మార్కెట్ లో సరసమైన ధరలలో పొందవచ్చు. దీపావళి సందర్భంగా ఇక్కడ అందమైన దీపాలు, మట్టి కుండలు, అందంగా డిజైన్ చేయబడిన దీపాలు, కొవ్వొత్తులను కొనుగోలు చేయవచ్చు.
భగీరథ్ ప్యాలెస్, చాందినీ చౌక్
దీపావళికి షాన్డిలియర్స్ లేదా లైట్లు కొనాలనుకుంటే భగీరథ్ ప్యాలెస్ బెస్ట్ ఆప్షన్. ఈ మార్కెట్ చాందినీ చౌక్‌లో ఉంది. దీపావళి రోజున ఇంటిని అందంగా అలంకరించేందుకు తక్కువ ధరలతో మంచి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలంకరించేందుకు ఇక్కడ అందమైన, ప్రత్యేకమైన లైట్లు, షాన్డిలియర్లు కొనుగోలు చేయవచ్చు. దీపావళికి ఇంటిని అలంకరించేందుకు రకరకాల రంగు రంగుల విద్యుత్ లైట్లను కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..