Diwali 2021: 2021 దీపావళి పండుగకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పండగ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఎన్నో రకాల వంటకాలు చేస్తారు. ముఖ్యంగా తీపి వంటకాలు ఎందుకంటే తీపి లేకుండా పండుగ జరుగదు. దీపావళి సందర్భంగా అనేక రకాల స్వీట్లను ఇళ్లలో తయారు చేస్తారు. అంతేకాకుండా మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. అందుకే ఈ సమయంలో గర్భిణీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. స్వీట్లను తినడం గర్భిణీలు తగ్గించాలి. ఎందుకంటే హార్మోన్ల మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు మధుమేహానికి గురవుతారు. దీనినే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దీనివల్ల డెలివరీ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.
గర్భధారణ గ్లూకోజ్ పెరుగుతుంది
సాధారణంగా గర్భిణీ శరీరంలో సహజంగా గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. ఈ గ్లూకోజ్ శిశువుకు పోషణ కోసం ఉపయోగపడుతుంది. దీని కారణంగా గర్భధారణ సమయంలో స్త్రీలకు గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
1. తల్లి శరీరంలో పెరిగిన గ్లూకోజ్ బొడ్డు తాడు గుండా వెళుతుంది శిశువు రక్తంలోకి చేరుతుంది. దీని కారణంగా పిల్లల బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రసవ సమయంలో తల్లి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
2. గర్భధారణ మధుమేహం అకాల డెలివరీ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాకుండా బిడ్డ పుట్టే సమయంలో కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది.
3. గర్భధారణ మధుమేహం నియంత్రించకపోతే పిల్లల నాడీ వ్యవస్థ పనిచేయదు. వెన్నుపాము, గౌట్, మూత్రాశయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.