
ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కనుబొమ్మలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కనుబొమ్మలు ముఖ సౌందర్యాన్ని, ఆకర్షణను పెంచుతాయి. అయితే ఒక్కరి కనుబొమ్మలు ఒక్క ఆకారంలో ఉంటాయి. అంటే మనుషుల కనుబొమ్మల ఆకారం భిన్నంగా ఉంటాయి. కొంతమందికి దట్టమైన కనుబొమ్మలు ఉంటాయి. మరికొందరికి చాలా సన్నని కనుబొమ్మలు ఉంటాయి. అయితే ఈ కనుబొమ్మల ఆకారం ఆధారంగా కూడా మనిషిలో దాగి ఉండే వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. అవును వ్యక్తిత్వాన్ని నుదురు, కళ్ళు, ముక్కు ఆకారం, కాళ్ళు, వేళ్ళ ఆకారం ద్వారా తెలుసుకున్నట్లే.మనుషుల వ్యక్తిత్వ రహస్యాన్ని కనుబొమ్మ ఆకారం ద్వారా తెలుసుకోవచ్చు. కనుబొమ్మల ఆకారాన్ని బట్టి వ్యక్తులు తార్కిక వ్యక్తినా, ప్రశాంతమైన వ్యక్తినా లేదా నాయకుడా అని తెలుసుకోవచ్చు.
మందపాటి కనుబొమ్మలు: ఎవరికైనా దట్టమైన కనుబొమ్మలు ఉంటే.. వీరు ఆత్మవిశ్వాసంతో , స్వతంత్ర భావాలతో ఉంటారు. వీరు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు. బదులుగా వీరు నియమాలను మాత్రమే అనుసరిస్తారు. దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ తార్కికంగా ఆలోచిస్తారు. ఇతరుల భావోద్వేగాలపై ప్రభావితం చూపించరు. అందువల్ల ఇతరులతో మానసికంగా కనెక్ట్ అవ్వడం మీకు సవాలుగా ఉండవచ్చు. అయితే వీరి ఆత్మవిశ్వాసం, స్పష్టమైన స్వభావం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి.
సన్నని కనుబొమ్మ: సన్నని కనుబొమ్మలు ఉన్నవారు అంతర్ముఖంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు వారు ఇతరుల అభిప్రాయాలను వింటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతిగా ఆలోచించి ఆందోళన చెందుతారు. అలాగే కరుణామయులు.. వీరు నమ్మదగిన వ్యక్తులు, నమ్మకమైన స్నేహితుడు.
వంపు తిరిగిన కనుబొమ్మ: వంపు తిరిగిన కనుబొమ్మలు ఉన్నవారు ఆశయం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కొందరు వీరి ధైర్య స్వభావాన్ని అహంకారంగా తప్పుగా భావించే అవకాశం కూడా ఉంది. అదనంగా, అతని ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఉత్తేజకరమైన వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే వీరు అంత త్వరగా ఇతరులతో కలిసి పోలేరు. దగ్గరవ్వరు.
నిటారుగా ఉన్న కనుబొమ్మ: కనుబొమ్మలు నిటారుగా ఉండే వ్యక్తులు సాధారణంగా హేతుబద్ధంగా ఉంటారు. వీరు ఏదైనా చర్య తీసుకునే ముందు లేదా ఏదైనా పని చేసే ముందు తార్కికంగా ఆలోచిస్తారు. వీరు భావోద్వేగాలకు అంత విలువ ఇవ్వరు. వీరు సత్యాన్ని మాత్రమే నమ్ముతారు. వీరి స్వభావరీత్యా ముక్కుసూటిగా ఉంటారు. భావోద్వేగాలకు పెద్దగా విలువ ఇవ్వరు. వీరు సమర్థవంతంగా, మొండిగా ఉంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)