ఈ లక్షణాలు ఉండే అబ్బాయిలు.. అమ్మాయిలకు అస్సలు నచ్చరట.. మీలోనూ ఉన్నాయా?!

సాధారణంగా ఒక అబ్బాయికి ఎవరైనా అమ్మాయి నచ్చుతే తనతో ఎలాగైనా మాట్లాడాలని తనతో పరిచయం పెంచుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ఆమెతో మాట్లాడానికి ప్రయత్నిస్తారు. ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి ఏవేవో తింగరు పనులు చేస్తారు. కొన్ని సార్లు అవి వర్కౌట్‌ అవుతాయి. కొన్ని సార్లు బెడిసికొడతాయి. ఇలా వాళ్లను ఇంప్రెస్‌ చేసే క్రమంలో అబ్బాయి ప్రదర్శించే లక్షణాలలో కొన్ని ఏ అమ్మాయికి నచ్చవని నిపుణులు అంటున్నారు. కాబట్టి, అమ్మాయిలకు కోపం తెప్పించే అబ్బాయిల లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ లక్షణాలు ఉండే అబ్బాయిలు.. అమ్మాయిలకు అస్సలు నచ్చరట..  మీలోనూ ఉన్నాయా?!
Lifestyle

Updated on: Sep 10, 2025 | 5:30 AM

అబ్బాయిలు ఎక్కువగా తమకు నచ్చిన అమ్మాయితో సరదాగా గడపాలని ఇష్టపడతారు. అవకాశం దొరికినప్పుడల్లా, తమకు నచ్చిన అమ్మాయితో మాట్లాడటానికి, ఆమెకు మెసెజ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితిలో, ఈ అబ్బాయిలు ప్రదర్శించే కొన్ని లక్షణాలు అమ్మాయిలకు చాలా చిరాకు తెప్పిస్తాయి , అవి వారిని చాలా కోపాని గురిచేస్తాయి. కాబట్టి ప్రతి అబ్బాయి అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడకూడదు అని రిలేషన్షిప్ కోచ్ అంటున్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చని లక్షణాలు ఏంటి అనేవి ఇక్కడ తెలుసుకుందాం.

అబ్బాయిలలో అమ్మాయికి నచ్చని ఐదు లక్షణాలు ఇవే

అమ్మాయి ఫోన్ నంబర్ అడగడం: చాలా మంది యువకులు ఒక అమ్మాయి నచ్చిన వెంటనే ఆమెతో ఎలాగొలా మాట్లాడాలనుకొని గబుక్కున ఫోన్‌ నెంబర్‌ అడిగేస్తారు. కానీ ఇలా చేయడం అమ్మాయిలకు అస్సలూ నచ్చదట. ఏ అమ్మాయి కూడా తనను పదేపదే ఫోన్ నంబర్ అడగడం, చిరాకు తెప్పించడం వంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను ఇష్టపడదట.

పాస్ట్‌ లవ్‌ గురించి అడగడం: ఎవరూ తమ గత ప్రేమకథలను, బ్రేకప్‌లను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. వారు అలాంటి విషయాలను తమకు అత్యంత సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారు. అలాంటి పరిస్థితిలో, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆమె పాస్ట్‌ లవ్‌ గురించి అడిగితే, ఆమెకు అది నచ్చదు. అది ఆమెను బాధపెట్టే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విషయం గురించి మాట్లాడకూడదని నిపుణులు అంటున్నారు.

ఫోటోలు అడగడం: కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని ఆమె ఫోటోలు కోసం పదే పదే అడుగుతారు. ఫోటోలు పంపమని చెప్పి ఆమెను వేధిస్తారు. అయితే, ఏ అమ్మాయి కూడా అబ్బాయిల ఈ లక్షణాన్ని ఇష్టపడదు. ఈ గుణం అమ్మాయిలను కోపగించగలదని నిపుణులు చెబుతున్నారు.

అతిగా పొగడ్తలు: కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి అందాన్ని పదే పదే పొగుడుతూ ఉంటారు. “నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా బోల్డ్ గా ఉన్నావు” అని అంటారు. అమ్మాయిలు ఈ గుణాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడరు, అలాంటి పొగడ్తలు వారిని అసౌకర్యానికి గురి చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఏం చేస్తున్నావు?: కొంతమంది అమ్మాయిలకు పదే పదే మెసేజ్‌లు చేస్తూ, ఏం చేస్తున్నావు అని అడుగుతూ, నాతో మాట్లాడమని అడుగుతుంటారు. ఈ మాటలు కూడా అమ్మాయిలకు చిరాకు తెప్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా అమ్మాయిలు మీ నుండి దూరంగా ఉండాలని కోరుకుంటాయి. కాబట్టి, ఏ అమ్మాయినీ అలాంటి ప్రశ్నలు అడగవద్దు అని నిపుణులు చెబుతున్నారు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించి వివరాల ద్వారా మాత్రమే అంచబడినవి వీటిపై మీకు ఏవైనా సందేహాలు నిపుణులను సంప్రదించవచ్చు

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.