
మీ ముఖంపై నల్లటి మచ్చలు కనిపిస్తే , అది బహుష పిగ్మెంటేషన్ కావొచ్చు. ఈ నల్లటి మచ్చలు ఎంత అందమైన ముఖాన్ని అయినా కళా విహీనంగా మార్చగలవు. చర్మంలో అధిక మెలనిన్ ఉత్పత్తి కావడం వల్ల ఈ వర్ణద్రవ్యం లేదా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. నిజం ఏమిటంటే, వాటిని దేనితోనూ దాచలేము. ఈ రోజుల్లో, దాదాపు ప్రతి మహిళ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఈ మచ్చలు చెంపలు, నుదుటిపై ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నల్లటి మచ్చలను తేలికపరచడంలో బంగాళాదుంపలతో సహా కొన్ని గృహోపకరణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పిగ్మంటేషన్‌పై బంగాళాదుంప ఎలా పనిచేస్తుంది? తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
బంగాళాదుంపలో సహజ సిద్ధమైన బ్లీచింగ్ గుణాలు, చర్మానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న నల్లటి మచ్చల తీవ్రతను తగ్గించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. దీనికోసం బంగాళాదుంపను తురిమి, దాని నుంచి రసాన్ని వేరు చేయాలి. ఈ రసాన్ని దూది సాయంతో ముఖంలోని నల్లటి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై స్వచ్ఛమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.
నల్లటి మచ్చలు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, సమ పరిమాణంలో బంగాళాదుంప రసం, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మలోని విటమిన్ C మచ్చలను త్వరగా నివారిస్తుంది.
ఒక స్పూన్ బంగాళాదుంప రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20-25 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. తేనెలోని ఆంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి తేమను, సహజ సిద్ధమైన కాంతిని ఇస్తాయి.
రసం తీసే సమయం లేకపోతే, బంగాళాదుంపను పలుచని చక్రాల్లా కోసి, ఆ ముక్కలతో ముఖంపై నల్లటి మచ్చలున్న చోట 10-15 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..