AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Habit: ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? అయితే ఆ రోగం పక్కా.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు!

ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు కేవలం అసహ్యకరమే కాదు, అది మెదడుకు కూడా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చేతుల ద్వారా చేరే బ్యాక్టీరియా ఘ్రాణ నాడి ద్వారా నేరుగా మెదడులోకి ప్రవేశించి ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తిని హరించే అల్జీమర్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ముప్పు ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ అలవాటును వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం.

Dangerous Habit: ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? అయితే ఆ రోగం పక్కా.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు!
Side Effects Of Nose Picking
Bhavani
|

Updated on: Apr 16, 2026 | 9:14 PM

Share

చాలా మందికి ఖాళీగా ఉన్నప్పుడు లేదా ముక్కులో అసౌకర్యంగా ఉన్నప్పుడు వేలు పెట్టి తిప్పడం ఒక అలవాటుగా ఉంటుంది. ఇది కేవలం అసహ్యకరమైన అలవాటు మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ చిన్న పని వల్ల ఏకంగా మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అల్జీమర్స్, డిమెన్షియా వంటి జ్ఞాపకశక్తిని హరించే వ్యాధులకు ఈ అలవాటుకు దగ్గరి సంబంధం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

మెదడులోకి ప్రవేశించే ప్రమాదకర బ్యాక్టీరియా మన ముక్కు లోపలి భాగం మెదడుకు చాలా దగ్గరగా ఉంటుంది. ముక్కులో వేలు పెట్టినప్పుడు మన చేతుల ద్వారా వైరల్, బ్యాక్టీరియల్ ఫంగల్ పాథోజెన్లు లోపలికి చేరుతాయి. ఇవి ఘ్రాణ నాడి (Olfactory Nerve) ద్వారా నేరుగా మెదడులోకి ప్రవేశించి అక్కడ ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తాయి. ఈ ప్రక్రియ వల్ల మెదడు కణాల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం క్రమంగా క్షీణిస్తాయి. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ అలవాటు ఉన్నవారిలో అల్జీమర్స్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు గుర్తించారు.

అల్జీమర్స్ అమిలాయిడ్ బీటా ప్రోటీన్ గ్రిఫిత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల ప్రకారం, ముక్కు ద్వారా ప్రవేశించే సూక్ష్మజీవులు మెదడులో ‘అమిలాయిడ్ బీటా ప్రోటీన్’ అనే నిక్షేపాలు పెరిగేలా ప్రేరేపిస్తాయి. మెదడులో ఈ ప్రోటీన్ అసాధారణంగా పోగుపడటం వల్ల అమిలాయిడ్-బీటా ఫలకాలు ఏర్పడతాయి. ఇవే అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణం. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, భాషా సమస్యలు ప్రవర్తనలో మార్పులు సంభవిస్తాయి. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో కూడా ముక్కు ద్వారా ప్రవేశించిన సూక్ష్మజీవులు మెదడు కణాలను నాశనం చేస్తాయని నిరూపితమైంది.

మతిమరుపు (డిమెన్షియా) ముప్పు మెదడులోని కణాలు దెబ్బతినడం వల్ల మతిమరుపు లేదా డిమెన్షియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముక్కు ద్వారా చేరే బ్యాక్టీరియా వల్ల న్యుమోనియా, చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే ఈ అలవాటును వెంటనే మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ముక్కును శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అయితే, ముందుగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల హానికర బ్యాక్టీరియా లోపలికి చేరకుండా నివారించవచ్చు. మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చిన్న మార్పు ఎంతో అవసరం.

గమనిక: ఈ వార్తలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వివిధ పరిశోధనలు, వైద్య నిపుణుల సూచనల ఆధారంగా దీనిని అందించాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఈ అంశంపై మరింత సమాచారం కావాల్సిన వారు నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది.

Follow Us
ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? ఏకంగా దానికే ముప్పు
ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? ఏకంగా దానికే ముప్పు
రామాయణంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందువుల ఆగ్రహం
రామాయణంపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందువుల ఆగ్రహం
ఈ 5 పనులు 21 రోజులు చేస్తే.. మీరు లైఫ్ డ్రీమ్ తప్పక నెరవేరుతుంది
ఈ 5 పనులు 21 రోజులు చేస్తే.. మీరు లైఫ్ డ్రీమ్ తప్పక నెరవేరుతుంది
ఆధార్‌ ఉన్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. ఇక మరింత సులభం!
ఆధార్‌ ఉన్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. ఇక మరింత సులభం!
భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
పచ్చి ఉల్లి రోజూ తింటే కలరా, డయాబెటీస్‌, కిడ్నీ వ్యాధులతో సహా..
పచ్చి ఉల్లి రోజూ తింటే కలరా, డయాబెటీస్‌, కిడ్నీ వ్యాధులతో సహా..
స్టార్ హీరో మరణం తర్వాత దొరికిన 64 సూట్‌కేసులు.. లోపల చూసి..
స్టార్ హీరో మరణం తర్వాత దొరికిన 64 సూట్‌కేసులు.. లోపల చూసి..
కేవలం 50 రూపాయలతో.. రోజంతా హెల్తీ డైట్ ప్లాన్ మీ కోసం 
కేవలం 50 రూపాయలతో.. రోజంతా హెల్తీ డైట్ ప్లాన్ మీ కోసం 
టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు..
టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు..
ఒకేరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన!
ఒకేరోజు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన!