Dandruff: వర్షాకాలంలో చుండ్రును తరిమికొట్టే పవర్‌ఫుల్ చిట్కా.. వారానికి 2 సార్లు చేస్తే సరి!

ఒకసారి చుండ్రు సమస్య మొదలైతే, దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో విధాలుగా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు సమస్య తగ్గదు. అంతే కాదు చుండ్రు వల్ల తలపై దురద, చికాకు కలుగుతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరూ ఈ సమస్యతో బాధపడుతుంటే..

Dandruff: వర్షాకాలంలో చుండ్రును తరిమికొట్టే పవర్‌ఫుల్ చిట్కా.. వారానికి 2 సార్లు చేస్తే సరి!
Dandruff Prevention Tips

Updated on: Jul 20, 2025 | 8:43 PM

వర్షాకాలం వచ్చిందంటే.. జుట్టు సమస్యలు మొదలైనట్లే. ముఖ్యంగా ఈ కాంలో చుండ్రు సమస్య ప్రతి ఒక్కరినీ వేదించే సాధారణ సమస్య. ఒకసారి చుండ్రు సమస్య మొదలైతే, దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో విధాలుగా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు సమస్య తగ్గదు. అంతే కాదు చుండ్రు వల్ల తలపై దురద, చికాకు కలుగుతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరూ ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఈ కింది సహజ చిట్కాలతో చిటికెలో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతే కాదు మీరు కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలను కూడా పొందుతారు. షాంపూ, సీరం, క్రీమ్ కోసం డబ్బు ఖర్చు చేసే బదులు, ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి సులువుగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి నూనె, నిమ్మరసం

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది. ఈ నూనెను నిమ్మరసంతో కలిపి తలకు మసాజ్ చేయాలి. తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచి తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది.

కలబంద

అందం గురించి చాలా శ్రద్ధ వహించే వారి ఇళ్లలో ఎల్లప్పుడూ కలబంద మొక్క ఉంటుంది. ఈ మొక్కలో లభించే ఔషధ గుణాలు సౌందర్య ఉత్పత్తులలో మాత్రమే కాకుండా వంటగదిలో చిన్న గాయాలకు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతే కాదు ఇది చుండ్రుకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. దీన్ని తలకు అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో సమాన మొత్తంలో కలిపి షాంపూ తయారు చేసుకోవచ్చు. తరువాత దానిని తలకు అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇది pH ను సమతుల్యం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది.

మెంతుల పేస్ట్

మెంతుల గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ లా చేసి, తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును కడుక్కోవాలి. ఇలా చేసినా దురద, చుండ్రు తగ్గుతాయి.

టీ ట్రీ ఆయిల్

షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. దీనికి యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది సహజంగా చుండ్రును తొలగించడానికి, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.