AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలంటే.. కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌..?

ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్‌స్టైల్, కాలుష్యం, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలో సహజసిద్ధమైన మూలికా సంరక్షణ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. జుట్టు సంరక్షణలో ఎక్కువగా వార్తల్లో నిలిచే రెండు ప్రధాన అంశాలు కరివేపాకు, రోజ్‌మేరీ. ఈ రెండింట్లో ఏది జుట్టుకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందో తెలుసుకుందాం.

జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలంటే.. కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌..?
Curry Leaves Vs Rosemary
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2026 | 3:51 PM

Share

జుట్టు సంరక్షణ, పెరుగుదలలో కరివేపాకు, రోజ్‌మేరీ రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. జుట్టు ఊడటం తగ్గించడంతో పాటు కొత్త జుట్టు వేగంగా పెరగడానికి శాస్త్రీయంగా రోజ్‌మేరీ ఆయిల్‌ లేదా రోజ్‌మేరీ ఆకులు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మరోవైపు, భారతీయులు తరతరాలుగా వాడుతున్న కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు బలాన్నిచ్చి జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి. వేగవంతమైన హెయిర్ గ్రోత్ కోసం ఏది ముఖ్యం అనేది ఇప్పుడు చూద్దాం..

రోజ్‌మేరీ– వేగవంతమైన జుట్టు పెరుగుదలకు:

ఇటీవలి కాలంలో హెయిర్ కేర్‌లో రోజ్‌మేరీ ఆయిల్, వాటర్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. రక్త ప్రసరణను వేగవంతం చేసి, వెంట్రుకల కుదుళ్లను ఉత్తేజపరచడంలో రోజ్‌మేరీ బాగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. జుట్టు పలుచబడటాన్ని నివారించి, కొత్త జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. ఇందుకోసం రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి కుదుళ్లకు పట్టించవచ్చు, లేదా రోజ్‌మేరీ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని స్ప్రేలా ఉపయోగించవచ్చు.

కరివేపాకు – కుదుళ్ల పోషణ, నల్లటి జుట్టుకు:

భారతీయ సాంప్రదాయ హెయిర్ కేర్‌లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్లు, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తీవ్రమైన పోషణను అందిస్తాయి. వెంట్రుకల మొదళ్లు బలహీనపడకుండా చూస్తాయి. అంతేకకుండా జుట్టు చిన్న వయస్సులోనే తెల్లబడకుండా అడ్డుకోవడంలో కరివేపాకు అద్భుతంగా తోడ్పడుతుంది. ఇందుకోసం కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి చల్లార్చిన తర్వాత రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌లా వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏది ఎంచుకోవాలి?:

మీరు తీవ్రమైన జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ, కొత్త జుట్టు వేగంగా పెరగాలని భావిస్తుంటే.. కొన్ని సైంటిఫిక్ ఆధారాలున్న రోజ్‌మేరీ ని ఎంచుకోవడం మంచిది. అదే విధంగా మీ జుట్టు చిట్ల కుండా, కుదుళ్లు బలంగా మారి తెల్లబడకుండా ఉండాలంటే.. సాంప్రదాయ కరివేపాకు నూనె బెస్ట్ ఛాయిస్. రెండు మూలికలు జుట్టుకు విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి.. కాబట్టి, మీ జుట్టు అవసరాన్ని బట్టి సరైనదాన్ని ఎంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Follow Us
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం