ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క రికీ పండ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
పండ్లు
అయితే చాలా వరకు పండ్లు అంటే అన్నీ కూడా శాకాహారమే. ప్రతి పండు శాకాహారం పండ్లు మాత్రమే ఉంటాయి అనుకుంటారు.
శాకాహారం పండ్లు
కానీ ప్రపంచంలో ఒకే ఒక మాంసాహారం పండు కూడా ఉన్నదంట. ఇంతకీ ఆ పండు ఏదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మాంసాహార పండు
అంజీర్ పండు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇది పండు కాదు, లోపల డొల్లగా ఉన్న ఒక గూడు లాంటిది. దీని పూలు కూడా లోపలే ఉంటాయంట.
అంజీర్ పండ్లు
అందువలన ఆడ కందిరీగ, ఈ పండు పైన చిన్న రంధ్రం చేసుకొని దానిలోని వెళ్తుందంట. లోనికి వెళ్లే సమయంలో దాని రెక్కలు, కొమ్ములు తెగిపోతాయంట.
చిక్కుక పోవడం
దీంతో అది బయటకు రాలేదు. లోపలే గుడ్లు పెట్టి అక్కడే చనిపోతుందంట. కందిరీగ చనిపోయిన తర్వాత అంజీర్ పండులో ఉండే ఫిసిన్ అంనే ఎంజైమ్ ఆ కందిరీగ శరీరాన్ని కరిగించేసి పండులో కలిపేస్తుంది.
చనిపోవడం
దీంతో ఆ పండులో కందిరీగ ఆనవాళ్లు ఏవి కనిపించవు. అంటే ఒక ప్రాణి చనిపోతేనే ఈ పండు తయారు అవుతుంది కాబట్టి, చాలా మంది దీనిని మాంసాహార పండు అంటారంట.
పండులో కలిసిపోతుంది
అంతే కాకుండా కొంత మంది శాకాహారులు జైనులు దీనిని తినరు. అయితే అడవిలో పెరిగే అంజీర్ పండ్లలో తప్పకుండా ఇది ఉంటుందట. కానీ హైబ్రిడ్ అంజీర్ పండ్లు చాలా వరకు సొంతంగా పరా సంపర్కం చేసుకుంటాయట.