పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఆహారం పొటాటో చిప్స్. అయితే డాక్టర్లు మాత్రం అత్యంత అనారోగ్యకరమైన ఆహారంగా పొటాటో చిప్స్‌ను చెబుతూ ఉంటారు. ఎందుకంటే బయట దొరికే చిప్స్ కరకరలాడుతూ ఉన్నా వాటిని వేయించేందుకు వాడిన నూనె, నిల్వ చేసేందుకు కలిపే ఉప్పు అన్నీ శరీరానికి హానీ చేస్తాయి. కాబట్టి పొటాటో చిప్స్ అత్యంత అనారోగ్యకరమైన ఆహారంగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. బంగాళదుంపలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి జబ్బులకు కారణం అవుతుంది. అలాగే వీటిని వేయించడానికి వాడే నూనె వల్ల ధీర్ఘకాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మీరు బంగాళాదుంప చిప్స్ ప్రేమికులైతే జాతీయ పొటాటో చిప్స్ డే (మార్చి 14) సందర్భంగా ఇంట్లో చేసేకునేలా ఓ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం. తక్కువ మసాలా, మంచి నూనె, తక్కువ ఉప్పు, లైట్‌గా మసాలా దినుసులను ఉపయోగించి చేసే తయారీ విధానంపై ఓ లుక్కెయ్యండి. అయితే బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ మరియు ఇతర పోషకాలు బంగాళదుంపలో తగినంతగా లేనందున వాటిని మితంగా తీసుకోవాలని మాత్రం వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..