Rain And Coronavirus: వర్షంలో తడిస్తే కరోనా వస్తుందా.! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

|

Jun 11, 2021 | 9:43 AM

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అక్కడక్కడా వర్షాలు దంచికొడుతున్నాయి. మనసును ఆహ్లాదపరుచుకునేందుకు...

Rain And Coronavirus: వర్షంలో తడిస్తే కరోనా వస్తుందా.! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.?
Corona Risk
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అక్కడక్కడా వర్షాలు దంచికొడుతున్నాయి. మనసును ఆహ్లాదపరుచుకునేందుకు కొంతమంది తొలకరి జల్లుల్లో తడుస్తుంటారు. అయితే ఈ కరోనా రోజుల్లో మాత్రం వర్షంలో తడవడం మంచిది కాదని డాక్టర్లు సూచిస్తున్నారు. వర్షంలో తడిస్తే కరోనా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వర్షపు నీరులో తడవడం వల్ల మన శరీరంలో వేడి పెరిగి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో.. కరోనా సోకే ఛాన్స్‌లు పెరుగుతాయని.. బ్లాక్ ఫంగస్ కూడా దాడి చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే వర్షంలో తడవద్దని సూచిస్తున్నారు.

అంతేకాకుండా వర్షాకాలంలో మన వాడే మాస్కులు తడిసిపోతే.. దానిపై ఉండే కరోనా వైరస్.. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుందని.. దాని వల్ల కరోనా సోకే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..