Foods for Glowing Skin: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం!

|

Feb 16, 2024 | 12:52 PM

అందమైన చర్మం, జుట్టు, గోర్లు ఉండాలని మహిళలు ఆరాట పడుతూ ఉంటారు. వీటి కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటా పార్లర్లకు క్యూ కడుతూ.. తమ అందానికి మెరుగు దిద్దుతూ ఉంటారు. వీటన్నింటినీ ట్రై చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తింటే.. ఎలాంటి టిప్స్ పాటించకుండానే మెరిసే అందమైన చర్మం, స్ట్రాంట్ జుట్టు మీ సొంతం అవుతాయి. కానీ అనారోగ్యకరమైన ఆహారాలు తింటూ.. మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులను కొని..

Foods for Glowing Skin: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం!
Glowing Skin
Follow us on

అందమైన చర్మం, జుట్టు, గోర్లు ఉండాలని మహిళలు ఆరాట పడుతూ ఉంటారు. వీటి కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటా పార్లర్లకు క్యూ కడుతూ.. తమ అందానికి మెరుగు దిద్దుతూ ఉంటారు. వీటన్నింటినీ ట్రై చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తింటే.. ఎలాంటి టిప్స్ పాటించకుండానే మెరిసే అందమైన చర్మం, స్ట్రాంట్ జుట్టు మీ సొంతం అవుతాయి. కానీ అనారోగ్యకరమైన ఆహారాలు తింటూ.. మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులను కొని తెచ్చుకుంటారు. హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చిలగడదుంపలు:

చిలగడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పుష్కలంగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా.. మెరుపును పెంచుతుంది. చిలగడ దుంప తింటే చర్మం అనేది మెరుస్తుంది. అంతేకాకుండా ముడతలు, మొటిమలు రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

కోడి గుడ్లు:

కోడి గుడ్లతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో బయోటిన్, ప్రోటీన్, విటమిన్ డి మెండుగా ఉంటాయి. తరచూ గుడ్డు తింటే బలమైన జుట్టు, గోర్లు, అందమైన స్కిన్ మీ సొంతం అవుతుంది. ఇది చర్మానికి పోషణ ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్‌లో పోషకాలు అధికంగా లభ్యమవుతాయి. కాబట్టి వీటిని తింటే ముడతలు రాకుండా మెరిసే చర్మాన్ని అందిస్తాయి. జుట్టు, గోర్లు కూడా బలంగా మారతాయి.

నీటి శాతం ఉన్న ఆహారాలు:

నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మృదువుగా, యంగ్‌గా ఉంటుంది. జుట్టుకు కూడా మెరుస్తూ ఉంటుంది.

నట్స్:

నట్స్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం, చర్మం, జుట్టు కూడా హెల్దీగా తయారవుతాయి. వీటిల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, బయోటిన్ వంటివి ఉంటాయి. ఇవి జుట్టు రాలడానికి కంట్రోల్ చేస్తాయి. చర్మానికి మంచి పోషణ అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.