మలబద్ధకం అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ సమస్య ఉన్నవారు మలాన్ని విసర్జించడం, ప్రేగుల కదలికల్లో ఇబ్బంది పడతారు. ఎవరైనా వారానికి నాలుగు సార్లు కంటే తక్కువ మలవిసర్జన చేస్తే లేదా మలవిసర్జన చేయడానికి ఎక్కువ శక్తిని ప్రయోగించవలసి వస్తే.. దానిని మలబద్ధకం అంటారు. పెద్దప్రేగు ద్వారా మలం సరిగా వెళ్లనప్పుడు మలబద్ధకం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, మలం విసర్జన సరిగ్గా జరగని సమయంలో శరీరం మలం నుండి ఎక్కువ నీటిని గ్రహిస్తుంది. దీని కారణంగా మలం గట్టిగా, పొడిగా మారి బయటకు విసర్జించడం చాలా కష్టం అవుతుంది. మలబద్ధకం సమస్య ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. అయితే ఈ సమస్య అనేక వ్యాధులకు కూడా కారణమవుతుంది,
మలబద్ధకం కారణంగా, కడుపులో బరువుగా అనిపిస్తుంది. దీని వల్ల ఆకలి కూడా సరిగా ఉండదు. కొంతమందికి మలబద్ధకం కారణంగా మలంలో రక్తం కనిపించవచ్చు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం కారణంగా వాంతులు కూడా సంభవించవచ్చు. మలబద్ధకం కూడా ఊబకాయాన్ని పెంచుతుంది.
మలబద్ధకం వల్ల ప్రజలు ఊబకాయం బారిన పడతారని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రోలజీ విభాగం మాజీ నివాసి డాక్టర్ అన్నయ గుప్తా చెప్పారు. ఎందుకంటే మలబద్ధకం కారణంగా శరీరంలోని జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కొవ్వు నిరంతరంగా చేరడం వల్ల బరువు పెరుగుతారు.
మలబద్ధకంతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలి తక్కువగా అనిపించవచ్చు. కొన్నిసార్లు హఠాత్తుగా ఎక్కువ ఆకలిగా అనిపించవచ్చు. దీని కారణంగా ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వస్తాయి, సమయం సందర్భం లేకుండా ఆహారం తినడం వంటి తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలిని అవలంబిస్తారు, దీని కారణంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
తినే ఆహారంలో ఫైబర్ లేకపోవడం కూడా మలబద్ధకానికి ప్రధాన కారణం.
మలబద్ధకం.. బరువు పెరగడానికి వ్యాయామం చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం.
తక్కువ నీరు తాగడం
తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం.
కాలేయ వ్యాధి
ప్రేగు క్యాన్సర్
కడుపు ఇన్ఫెక్షన్
ibs (ప్రేగు సంబంధిత రుగ్మత)
నీటిని ఎక్కువగా తాగాలి
పుచ్చకాయ, పైనాపిల్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినండి.
అరటి, యాపిల్, క్యాబేజీ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
రోజూ వ్యాయామం చేయండి.
నాన్ వెజ్ ఫుడ్స్ దూరంగా ఉండడమే కాదు తినే ఆహారంలో పప్పులు చేర్చుకోండి
తగినంత నిద్ర పొందండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..