AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి..

ఇప్పుడున్న కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, టెన్షన్‌, ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాల వల్ల మనిషికి గుండెకు సంబంధించిన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి. అస్థిరంగా రొమ్మునొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే వైద్యున్ని సంప్రదించాలి.

Prudvi Battula
|

Updated on: Aug 13, 2024 | 9:06 AM

Share
దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
 చేపలు తింటే ఉపయోగాలెన్నో: సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.

2 / 5
 ఆకు కూరలు: ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.

3 / 5
ఓట్స్‌: ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజు ఓట్స్ తీసుకోవాలి.

4 / 5
 గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

5 / 5
Follow Us
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!

లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే

దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే

అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..

ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..

భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత

Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్

వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!

రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..

రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం