Coconut Sugar: కొబ్బరి చక్కెర ఎప్పుడైనా తిన్నారా? మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట దివ్యౌషధం

|

Sep 20, 2023 | 10:18 AM

కూల్‌ డ్రింక్స్, స్వీట్స్‌ వంటి వాటిల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా అనేక రకాల వంటలలో చక్కెరను వినియోగిస్తుంటారు. కానీ ఎక్కువ చక్కెర తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చక్కెర అధికంగా తినడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, కొవ్వు కాలేయం వంటి ఆరోగ్య సమస్యలను తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఎల్లప్పుడూ చక్కెర తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే రోజు వారీ ఆహారంలో తెల్ల చక్కెరకు బదులుగా ఇతర..

Coconut Sugar: కొబ్బరి చక్కెర ఎప్పుడైనా తిన్నారా? మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట దివ్యౌషధం
Coconut Sugar
Follow us on

కూల్‌ డ్రింక్స్, స్వీట్స్‌ వంటి వాటిల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా అనేక రకాల వంటలలో చక్కెరను వినియోగిస్తుంటారు. కానీ ఎక్కువ చక్కెర తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చక్కెర అధికంగా తినడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, కొవ్వు కాలేయం వంటి ఆరోగ్య సమస్యలను తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఎల్లప్పుడూ చక్కెర తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే రోజు వారీ ఆహారంలో తెల్ల చక్కెరకు బదులుగా ఇతర చక్కెరలు కూడా తీసుకోవచ్చు. అలాంటి వాటిల్లో బెల్లం, బ్రౌన్ షుగర్ వంటి ఎంపికలు ఉన్నాయి. అయితే మీరెప్పుడైనా కొబ్బరి చక్కెర గురించి విన్నారా? కొబ్బరి చక్కెర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ చక్కెరను కొబ్బరి చెట్టు నుంచి తీసిన ప్రత్యేక రసంతో దీనిని తయారు చేస్తారు. దీనిలో ఎలాంటి రసాయనాలు కలపరు. చూసేందుకు బ్రౌన్‌ షుగర్‌ మాదిరి ఉంటుంది. ఈ చక్కెర ఆహారంలో భాగంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది

కొబ్బరి చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధించడానికి ఇది పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ చక్కెర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే సాధారణ చక్కెరకు బదులుగా కొబ్బరి చక్కెరను కూడా ఉపయోగించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గటానికి కొబ్బరి చక్కెరలో ఫైబర్ ఉపయోగపడుతుంది. ఈ చక్కెర తినడం వల్ల చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచడమేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది.

తక్కువ ప్రాసెస్

సాధారణ తెల్ల చక్కెర కంటే కొబ్బరి చక్కెర తక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. అందువల్ల కొబ్బరి చక్కెర ఆరోగ్యానికి మంచిది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి చక్కెరలో ఏయే పోషకాలు ఉన్నాయంటే..

కొబ్బరి చక్కెరలో కాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చక్కెర తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

హైపోగ్లైసీమియా

కొబ్బరి చక్కెర హైపోగ్లైసీమియా సమస్యను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. హైపోగ్లైసీమియా సమస్య వల్ల వణుకు, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

కొబ్బరి చక్కెర తినడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఈ చక్కెర శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.