Cloves Tea: భోజనం తర్వాత కప్పు లవంగం టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించని లాభాలు..

భారతీయ వంటకాల్లో వినియోగించే మసాలా దినుసుల్లో లవంగం ఒకటి. లవంగాలు వంట రుచిని పెంచడమేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి వంటగదిలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఈ లవంగాన్ని తీసుకుంటే వంటలో రుచి పెరగడమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకుంటే అలసట, నిద్రలేమి, నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు..

Cloves Tea: భోజనం తర్వాత కప్పు లవంగం టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించని లాభాలు..
Cloves Tea

Updated on: Jun 06, 2024 | 9:16 PM

భారతీయ వంటకాల్లో వినియోగించే మసాలా దినుసుల్లో లవంగం ఒకటి. లవంగాలు వంట రుచిని పెంచడమేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి వంటగదిలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఈ లవంగాన్ని తీసుకుంటే వంటలో రుచి పెరగడమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకుంటే అలసట, నిద్రలేమి, నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి. ఆయుర్వేదం ప్రకారం లవంగాలు తినడం వల్ల ఎంజైమ్ స్రావాన్ని పెంచుతుంది. అంతేకాదు లవంగాల వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నివారణకు ప్రతిరోజూ 2 లవంగాలు తీసుకోవాలని చెబుతున్నారు. లవంగం జీర్ణక్రియకు ఉత్తమ ఔషధం.

జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రెండు లవంగాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. లవంగాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్‌తోపాటు ఇతర అనేక పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటాయి. లవంగాలలో విటమిన్-బి1, విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే వీటిల్లోని విటమిన్-కె, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు సహాయపడతాయి.

చాలా మందికి లవంగాలు ఏ సమయంలో తీసుకుంటే మంచిదో తెలియదు. లవంగాలను ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. వేడినీళ్లతో రెండు లవంగాలు, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి తీసుకుంటే రకరకాల శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రతి రోజూ భోజనం తర్వాత ఈ టీ తాగితే.. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు, వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.