Cleaning Hacks: ఇంటి నేలపై, గోడలకు నాచు పట్టేసిందా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా శుభ్రం చేసుకోండి..

వర్షాకాలం తర్వాత ఇంటి గోడలకు, నేలలపై నాచు పడుతుంది. ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే నాచు అంద వికారంగా కనిపించడమే కాదు.. ఈ నాచు మీద అడుగు పెడితే.. జారిపడే ప్రమాదానికి కూడా కారణం అవుతుంది. ఎవరైనా ఈ నాచుతో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే దానిని తొలగించుకోవాలని భావిస్తారు. అయితే నాచుని కష్టపడకుండా.. నిమిషాల్లో శుభ్రం చేయడంలో మీకు సహాయపడే కొన్ని ప్రభావవంతమైన వంటింటి చిట్కాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Cleaning Hacks: ఇంటి నేలపై, గోడలకు నాచు పట్టేసిందా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా శుభ్రం చేసుకోండి..
Cleaning Hacks

Updated on: Oct 03, 2025 | 3:01 PM

వర్షాకాలంలో కరిసిన వర్షాలకు గోడలు, నేలపై నాచు పేరుకుపోయి కనిపిస్తుంది. ఈ నాచు వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. ఇది వికారంగా కనిపించడమే కాదు.. దీనిమీద అడుగు పెడితే జారిపడే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. అందుకనే నాచుని తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని సాధారణ ఇంటి నివారణలతో ఈ మొండి నాచును నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. ఈ రోజు ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడే ఐదు సులభమైన పరిష్కారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

వెనిగర్, నీటి ద్రావణం: వెనిగర్ లోని ఆమ్ల లక్షణాలు నాచును తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. స్ప్రే బాటిల్‌లో సమాన భాగాలుగా వెనిగర్ .. నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని నేరుగా నాచు ఉన్న ప్రాంతంపై స్ప్రే చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గట్టి బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడా:మరొక వంటింటి చిట్కా బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాను నీటితో కలిపి థిక్ పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను నాచుపై అప్లై చేసి కొన్ని గంటలు అలాగే ఉంచండి. తరువాత.. ఆ నాచుని బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి. చిన్న ప్రదేశాల నుంచి నాచును తొలగించడానికి ఈ పద్ధతి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్: నాచు చాలా ఎక్కువగా ఉంటే.. బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించేటప్పుడు చేతికి గ్లౌస్ ని ధరించడం మర్చిపోవద్దు. నాచు సోకిన ప్రదేశంలో కొద్ది మొత్తంలో బ్లీచింగ్ పౌడర్ చల్లి.. నీటితో తడిపి, కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

వేడి నీరు డిటర్జెంట్: ఇది అత్యంత సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొద్ది మొత్తంలో డిటర్జెంట్ లేదా డిష్ వాషింగ్ లిక్విడ్ కలపండి. ఈ ద్రావణాన్ని నాచుతో నిండిన ప్రదేశంలో పోసి వెంటనే గట్టి చీపురుతో లేదా బ్రష్‌తో స్క్రబ్ చేయండి. వేడి నీరు నాచు పట్టును సడలించి.. దానిని సులభంగా తొలగించడానికి వీలు కల్పిస్తుంది.

ఉప్పు,నిమ్మరసం పేస్ట్ : నిమ్మలోని ఆమ్లత్వం , ఉప్పు కరుకుదనం కలిసి నాచును తొలగించడానికి ఒక గొప్ప నివారణగా తయారవుతాయి. ఒక గిన్నెలో నిమ్మరసం.. ఉప్పు కలిపి మందపాటి పేస్ట్ లా తయారు చేయండి. నాచుకు అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, బ్రష్ తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)