Weight Loss : ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలలో ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతోంది. అందులో భాగంగానే యునైటెడ్ కింగ్‌డమ్ (UK) పౌరులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారో వారికి నగదు బహుమతి అందిస్తామని ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకుంటే ఈ దేశంలో స్థూలకాయం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి బయటపడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యాప్ సాయంతో పర్యవేక్షణ
ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. UK లో ప్రభుత్వం బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించే కుటుంబాలకు నగదు రివార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఈ ఆరోగ్య పథకం కింద యాప్ ద్వారా, ప్రజలు ఎన్ని పండ్లు, కూరగాయలు తింటున్నారో అబ్జర్వ్ చేస్తారు. దేశంలో ఊబకాయం పెరుగుతున్న సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ ఉద్దేశం. సూపర్ మార్కెట్లో ఒక కుటుంబం ఎంత ఖర్చు చేస్తుందో అబ్జర్వ్ చేస్తారు.
కేలరీల ఆహారాలకు బదులుగా పండ్లు, కూరగాయలను కొనడానికి ఎంత మంది ఇష్టపడతారో కూడా అబ్జర్వ్ చేస్తారు. అధిక బరువు గల వ్యక్తులను ఎన్నుకోవడం, బరువు నిర్వహణ కోర్సులకు పంపడం ఇంగ్లాండ్ కౌన్సిల్స్ బాధ్యత. ఈ నిర్వహణ కోర్సులను వెయిట్ వాచర్స్, స్లిమ్మింగ్ వరల్డ్ వంటి సంస్థలు అందిస్తాయి. ఆర్థిక రివార్డులతో పాటు ఈ పథకం కింద వ్యాయామం కోసం ఉచిత టిక్కెట్లు, డిస్కౌంట్‌గా మార్చుకోగల ఆరోగ్య యాప్‌లో పాయింట్లు అందుబాటులో ఉంటాయి. ఇతర బహుమతులు కూడా అందిస్తారు.
యుకెలో పరిస్థితి ఘోరం
UK పశ్చిమ ఐరోపాలో పెరుగుతున్న స్థూలకాయం అధికారులను ఇబ్బంది పెడుతోంది. ప్రాథమిక పాఠశాల నుంచి బయలుదేరేటప్పుడు UK లో ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనాలు అనేక సర్వేలు వెల్లడించాయి. అదే సమయంలో ముగ్గురు పెద్దలలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఈ కొత్త ప్రణాళికకు యుకె పిఎం బోరిస్ జాన్సన్ మద్దతు ఇచ్చారు. UK ఫిట్‌గా ఉండటానికి ఈ మొత్తం ప్రచారంలో అతను ప్రధాన పాత్రలో ఉన్నాడని తెలిపారు. గత సంవత్సరం పిఎం జాన్సన్ కోవిడ్ -19 తో బాధపడుతున్నప్పుడు అతని బరువు చాలా తగ్గింది.