Weight Loss: సూర్య నమస్కారాలతో బరువు తగ్గొచ్చని తెలుసా.. ఇలా చేస్తే మంచి ఫలితాలు..!

|

Feb 15, 2022 | 8:05 AM

‌108 Surya Namaskars: ఫిట్‌నెస్ నిపుణులు తరచుగా 27 నుంచి 54 లేదా 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయాలని సిఫార్సు చేస్తుంటారు. అయితే వరుసగా ఐదు నుంచి 10 సెట్‌లను ప్రదర్శించిన తర్వాత కొందరు అలసిపోయినట్లుగా..

Weight Loss: సూర్య నమస్కారాలతో బరువు తగ్గొచ్చని తెలుసా.. ఇలా చేస్తే మంచి ఫలితాలు..!
Surya Namaskar
Follow us on

Weight Loss: కరీనా కపూర్ ఖాన్, శిల్పాశెట్టి, మలైకా అరోరా వంటి నటీమణులే కాకుండా వీరికి ఒక ఉమ్మడి విషయం కూడా ఉంది. వీరంతా ఫిట్‌నెస్(Fitness) సలహాలు ఇస్తుండడంలో కూడా పేరుగాంచారు. బాలీవుడ్‌లోని అత్యంత విజయవంతమైన వీరంతా ప్రతిరోజు 108(108 Surya Namaskars) రౌండ్ల సూర్య నమస్కారం చేస్తూ తమ ఫిటెనెస్‌ను కాపాడుకుంటుంటారు. వీటితోపాటు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ, ఈ సెలబ్రిటీలు సూర్య నమస్కార్రాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తుంటుంటారు. ఇది ఏ సమయంలోనైనా బరువు తగ్గడానికి ప్రేరేపించే ఉత్తమ శరీర యోగా-కార్డియో వ్యాయామాలలో ఒకటిగా పేరుగాంచింది.

సూర్య నమస్కారం ఎలా చేయాలి?

సూర్య నమస్కారం అనేది దాదాపు ప్రతి కండరాల సమూహాన్ని, ప్రతి శరీర భాగాన్ని ఒకే విధంగా లక్ష్యంగా చేసుకునే వ్యాయామం. ప్రారంభంలో ఇది మీకు నొప్పిని కలిగిస్తుంది. అయితే, కాలక్రమేణా, కీళ్ల నొప్పులు, గట్టి ఎముకలు, గొంతు కండరాల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. సూర్య నమస్కారం ఒక సర్క్యూట్ యోగా వ్యాయామం. ఇది మొత్తం 12 భంగిమల క్రమాన్ని కలిగి ఉంది. వాటిలో కొన్ని యోగా నుంచి ప్రేరణ పొందినవి కావడం విశేషం. వెనుకకు వంగి ఉండడం, ముందుకు వంగి ఉండడం, కోబ్రా భంగిమ, కాళ్లు చేతులు నేలపై ఉంచి నడుమును పైకి లేపడం, ఒక కాలు నేలపై ఆనించి మరో కాలుపై ఉండడం, రెండు చేతులను నేలపై ఆన్చి డిప్స్ కొట్టడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి.

108 సూర్య నమస్కారాలను ఎలా పూర్తి చేయాలి?

ఫిట్‌నెస్ నిపుణులు తరచుగా 27 నుంచి 54 లేదా 108 రౌండ్ల సూర్య నమస్కారాలను సిఫార్సు చేస్తుంటుంటారు. వరుసగా ఐదు నుంచి 10 సెట్‌లను ప్రదర్శించిన తర్వాత కొందరు అలసిపోయినట్లుగా ఫీలవతుంటుంటారు. ఇది ఎక్కువగా కొత్తవారిలో కనిపిస్తుంది. ఇది స్టామినాను పెంపొందించడానికి అభ్యాసం అవసరమయ్యే కళ అయినప్పటికీ, వరుసగా మొత్తం 108 పూర్తి చేయడానికి ఒక సాధారణ సమయం ఉంది. అనుకున్న సమయంలో 108 సూర్య నమాస్కారాలను ఆపకుండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక శ్వాసతో ఒక భంగిమ – ఇలా చేయడం వలన వరుసగా 108 రౌండ్ల సూర్య నమస్కారాలను పూర్తి చేయవచ్చు. శ్వాస పద్ధతిని మాత్రమే మార్చడం ద్వారా వీటిని పూర్తి చేయవచ్చు. అయితే ఇందుకు నిపుణుల సలహా కూడా తీసుకోవడం మంచింది. అయితే ఇది అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుంది. అయితే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడంతోనే ఉత్తమ ఫలితాలను పొందగలం.

యోగాలో ప్రాణాయామం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వలన మన శరీరంలోని విషపదార్థాలను తొలగించి, శక్తిని పెంపొందించడంతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. స్టామినా మెరుగుపడినప్పుడు, సూర్య నమస్కారం చేసే ప్రతి రౌండ్‌లో శరీరం శక్తిని పొందడం ప్రారంభిస్తుంది. దీంతో 108 రౌండ్లు పూర్తి చేయడం సులభం అవుతుంది. సరైన శ్వాస పద్ధతులను అనుసరించి ఈ వ్యాయామం నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు.

కాలక్రమేణా, వేగాన్ని పెంచి ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఎంత వేగంగా ఈ 108 సూర్య నమస్కారాలను చేస్తారో.. అంత ఎక్కువగా మీరు బరువు తగ్గించుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న చిట్కాలు, పద్ధతులు కేవలం సూచనలుగానే పరిణించండి. ఏదైనా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండం మంచిది.

Also Read: Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..