భోజనం చేసిన వెంటనే యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా మంది చేసే పొరబాటు అదే..

యోగికి ఎటువంటి వ్యాధి లేనట్లుగా, యోగా చేసేవారి ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని చెబుతున్నారు నిపుణులు. యోగాతో పాటు, ఆహారానికి కూడా మంచి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎలా ఉండాలి? ఆహారం తినడానికి, యోగా చేయడానికి మధ్య ఎంత సమయం ఉండాలి? అనే విషయాల గురించి..

భోజనం చేసిన వెంటనే యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా మంది చేసే పొరబాటు అదే..
Yoga After Meals

Updated on: Jun 23, 2025 | 10:28 AM

ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ కార్యకలాపాల్లో శారీరక వ్యాయామాన్ని భాగం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్నపాటి యోగాసనాలు ఆరోగ్యానికి చెప్పలేనంత మేలు చేస్తాయి. యోగా శరీర వశ్యతను పెంచడంలో సహాయపడటమే కాకుండా, మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యోగికి ఎటువంటి వ్యాధి లేనట్లుగా, యోగా చేసేవారి ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని చెబుతున్నారు నిపుణులు. యోగాతో పాటు, ఆహారానికి కూడా మంచి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎలా ఉండాలి? ఆహారం తినడానికి, యోగా చేయడానికి మధ్య ఎంత సమయం ఉండాలి? అనే విషయాల గురించి సీనియర్ డైటీషియన్, డయాబెటిస్ నిపుణుడు డాక్టర్ నిషా జైన్ మాట్లాడుతూ..

యోగా చేయడానికి ముందు మీ కడుపు సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉండాలని అన్నారు. భోజనానికి, యోగాకు మధ్య కనీసం 8 నుంచి 10 గంటల గ్యాప్ నిర్వహించడం మంచిదని సూచించారు. సాయంత్రం త్వరగా భోజనం తినవచ్చు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం పూట యోగా క్షేమంగా చేయవచ్చు. అయితే పగటిపూట యోగా చేస్తుంటే మాత్రం తినడానికి, యోగాకి మధ్య కనీసం 1 గంట గ్యాప్ అవసరమని చెప్పారు. అంటే భోజనం తిన్న 1 గంటలోపు యోగా చేయకుండా ఉండాలని అంటున్నారు.

యోగా చేసే ముందు ఏమి తినాలి?

యోగా చేసే ముందు తేలికైన ఆహారాలు తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యోగా చేసే ముందు గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, అరటిపండ్లు, ఆపిల్స్ తినవచ్చు. నట్స్, డ్రైఫ్రూట్స్‌ వంటి ఆహారాలు తినవచ్చు. ఈ ఆహారాలు శరీరంలో నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. ఇది యోగా సమయంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది కూడా.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా యోగా చేసే ముందు వేయించిన లేదా కారంగా ఉండే ఆహారాన్ని పూర్తిగా మానేయడం మంచిది. ఇది కడుపు ఉబ్బరం, కడుపులో భారమైన అనుభూతి, వికారం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

యోగా చేసిన తర్వాత ఎంత తినాలి?

యోగా చేసిన 30 నిమిషాల తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఇది శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తుంది. దీనితో పాటు, కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. అలాగే యోగా తర్వాత ప్రోటీన్ ఆహారాలు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ఉడికించిన గుడ్లు తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.