‘గుండె జబ్బుల చికిత్సకు వాడే మందులతో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం..’ సైంటిస్టులు ఏమంటున్నారంటే..

అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రకాల మందులు ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి కూడా. చాలా మందికి వివిధ రకాల మందులకు సంబంధించిన అలెర్జీలు ఉంటాయి. దీంతో మందులు ఒక వ్యాధికి వాడితే అది మరొక వ్యాధికి కారణమవుతుంది. ఇది శరీరంలోని..

గుండె జబ్బుల చికిత్సకు వాడే మందులతో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం.. సైంటిస్టులు ఏమంటున్నారంటే..
అధిక కెఫిన్ ఉద్దీపనలు గుండెను ఓవర్‌డ్రైవ్‌లోకి నెట్టివేస్తాయి. ఇది క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతుంది, రక్తపోటును పెంచుతుంది. కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తుంది. ఇది మీ గుండె రోజంతా 'మాక్స్ మోడ్'లో పనిచేసేలా రూపొందించబడలేదు అని ఆయన అన్నారు. అందుకే అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.

Updated on: Sep 03, 2025 | 9:17 PM

సుస్తి చేసినప్పుడు డాక్టర్‌ వద్ద మందులు తీసుకుని, ఉపశమనం పొందడం దాదాపు ప్రతి ఒక్కరూ చేసేదే. కానీ మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ కొన్ని రకాల మందులు ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి కూడా. చాలా మందికి వివిధ రకాల మందులకు సంబంధించిన అలెర్జీలు ఉంటాయి. దీంతో మందులు ఒక వ్యాధికి వాడితే అది మరొక వ్యాధికి కారణమవుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా హాని కలిగించవచ్చు. వివిధ అధ్యయనాలలో కూడా ఇది నిరూపించబడింది. అదేవిధంగా గుండె జబ్బుల చికిత్సలో ఉపయోగించే కొన్ని మందులు కూడా శరీరానికి హాని కలిగిస్తాయా? అనే సందేహం మీకు ఉందా..

నిజానికి, గుండెపోటు రోగులకు చికిత్స చేయడానికి బీటా బ్లాకర్లను ఎన్నో యేళ్లుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మందులు రోగులకు పెద్దగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. నిజానికి కొన్ని సందర్భాల్లో, ఈ మందులు మహిళల మరణానికి దారితీస్తాయట. ఈ పరిశోధనను యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్‌లో ప్రదర్శించారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్‌ యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో దీనిని ప్రచురించారు. టా బ్లాకర్లతో చికిత్స పొందిన మహిళలకు, మందులు తీసుకోని వారి కంటే మరణం, గుండెపోటు, గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

గుండెపోటు రోగులకు చికిత్స చేయడంలో బీటా బ్లాకర్స్ ఎలా పని చేస్తాయి?

బీటా బ్లాకర్స్ అనేవి వివిధ గుండె సమస్యలకు రోగులకు ఇచ్చే ఒక రకమైన మందులు. ముఖ్యంగా గుండెపోటు చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. ఇవి హృదయ స్పందనను నెమ్మదిస్తాయి. గుండె కండరాల సంకోచ శక్తిని తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఈ ప్రభావాలు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తాయి. ఇది భవిష్యత్తులో గుండెపోటును నివారించడానికి కూడా సహాయపడుతుంది. తద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. సంక్లిష్టమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ రోగులలో 80 శాతం కంటే ఎక్కువ మందికి డిశ్చార్జ్ అయిన తర్వాత బీటా-బ్లాకర్లు వైద్యులు సూచిస్తుంటారని స్పెయిన్‌లోని సెంట్రో నేషనల్ డి ఇన్వెస్టిగేసియోన్స్ కార్డియోవాస్కులర్స్ (CNIC)లో సైంటిఫిక్ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బోర్జా ఇబానెజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయనంలో స్పెయిన్, ఇటలీలోని 109 ఆసుపత్రుల నుంచి 8,505 మంది రోగులు పాల్గొన్నారు. వారిని యాదృచ్ఛికంగా రెండు గ్రూపులలో ఒకదానికి కేటాయించారు. ఒక గ్రూపుకు బీటా బ్లాకర్లు ఇవ్వబడ్డాయి. మరొక దానికి ఇవ్వబడలేదు. రెండు గ్రూపులకు ప్రామాణిక చికిత్స అందించారు. ఇలా నాలుగు గడిచాక మరణాలు, పునరావృత గుండెపోటులు, గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరడం పరంగా రెండు గ్రూపుల మధ్య గణనీయమైన తేడా లేదని ఫలితాలు చూపించాయి. అయితే, బీటా-బ్లాకర్లను తీసుకోవడం వల్ల మహిళలు ప్రతికూల ప్రభావాలను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వీరి విశ్లేషణలో తేలింది. బీటా బ్లాకర్లతో చికిత్స పొందిన స్త్రీలు, చికిత్స పొందిన మొత్తం కాలంలో ఇతరుల కంటే 2.7 శాతం ఎక్కువ మరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు వీరి అధ్యయనంలో కనుగొన్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.