AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాల్ నట్స్ కొంటున్నారా? పెంకు పగలకుండానే మంచి నాణ్యమైనవి ఎలా గుర్తించాలో తెలుసుకోండి!

డ్రై ఫ్రూట్స్‌లో వాల్ నట్స్ అత్యంత పౌష్టికాహారంగా పరిగణించబడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే వాల్ నట్స్ గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే మార్కెట్‌లో కొనుగోలు చేసేటప్పుడు పెంకు మూసి ఉన్న వాల్ నట్స్ లోపల మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలామందికి పెద్ద సవాలుగా మారుతుంది. పెంకును పగలకుండానే తాజా, నాణ్యమైన వాల్ నట్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు చూద్దాం.

వాల్ నట్స్ కొంటున్నారా? పెంకు పగలకుండానే మంచి నాణ్యమైనవి ఎలా గుర్తించాలో తెలుసుకోండి!
Walnut Buying Tips
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2026 | 8:56 PM

Share

వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పెంకు తీయకుండా మంచి, తాజా వాల్ నట్స్‌ను ఎంచుకోవడం కాస్త కష్టమైన పనే. నాణ్యమైన వాల్ నట్స్‌ను కొనుగోలు చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి. అవేంటంటే..

1. పెంకు రంగు, రూపం పరిశీలించండి

నాణ్యమైన వాల్ నట్ పెంకు లేత బంగారు-గోధుమ రంగులో ఉంటుంది. పెంకుపై నల్లటి మచ్చలు, రంధ్రాలు లేదా నల్లబడిన గుర్తులు ఉంటే వాటిని తీసుకోకపోవడమే మంచిది. పెంకుపై బూజు పట్టినట్లు లేదా తేమగా అనిపిస్తే అవి లోపల పాడైపోయాయని అర్థం.

2. ఊపి చూడండి

వాల్ నట్‌ను చెవి దగ్గర పెట్టుకుని గట్టిగా ఊపాలి. ఒకవేళ లోపల ఉన్న గింజ గిలగిలా కదులుతూ శబ్దం వస్తుంటే, ఆ వాల్ నట్ పాతబడిపోయి లోపల ఎండిపోయిందని గ్రహించాలి. అదే తాజా వాల్ నట్ అయితే లోపలి గింజ పెంకును పూర్తిగా నింపి ఉంటుంది. కాబట్టి, ఎలాంటి శబ్దం రాదు.

ఇవి కూడా చదవండి

3. బరువును గమనించండి

రెండు సమాన పరిమాణం ఉన్న వాల్ నట్స్‌ను చేతిలోకి తీసుకుని పోల్చండి. పరిమాణానికి తగ్గట్టుగా బరువుగా ఉన్న వాల్ నట్ ఎప్పుడూ మంచి నాణ్యత కలిగి ఉంటుంది. తేలికగా అనిపించే వాల్ నట్స్‌లో లోపలి పప్పు ఎండిపోయి సన్నగా మారి ఉంటుంది.

4. వాసన చూడటం

పెంకు మూసి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాతబడిన లేదా పాడైపోయిన వాల్ నట్స్ నుండి ఒక విధమైన పులిసిన లేదా ముక్కిపోయిన వాసన వస్తుంది. తాజా వాల్ నట్స్‌కు ఎలాంటి చెడు వాసన ఉండదు.

5. పెంకు మూత గమనించడం

వాల్ నట్ పెంకు రెండు సగాలు కలిసే జోడు భాగం సరిగ్గా మూసుకుని ఉందో లేదో చూడాలి. అక్కడ చిన్న పగులు ఉన్నా గాలి లోపలికి వెళ్లి పప్పు త్వరగా పాడవుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు డబ్బు వృథా కాకుండా ఎల్లప్పుడూ ఇంట్లోకి తాజా, ఆరోగ్యకరమైన, నాణ్యమైన వాల్ నట్స్‌ను ఎంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి
పేరుకే విష యోగం.. కానీ ఈ రాశులకు మాత్రం జాక్‌పాట్!
పేరుకే విష యోగం.. కానీ ఈ రాశులకు మాత్రం జాక్‌పాట్!
పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన కోచ్
పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన కోచ్
పెళ్లి ఆలస్యమవుతున్నవారు తప్పక చేయాల్సిన పరిహారమిది!
పెళ్లి ఆలస్యమవుతున్నవారు తప్పక చేయాల్సిన పరిహారమిది!
సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌..!
సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌..!
వామ్మో.. వర్కౌట్‌ చేసేవారు నీళ్లు ఇలా తాగితే ప్రమాదమే!
వామ్మో.. వర్కౌట్‌ చేసేవారు నీళ్లు ఇలా తాగితే ప్రమాదమే!
ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర..దారుణ హత్య
ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర..దారుణ హత్య
జాతకం మారబోతుంది.. గెట్ రెడీ అంటున్న సూర్యుడు.. వీరికి తిరుగుడదు
జాతకం మారబోతుంది.. గెట్ రెడీ అంటున్న సూర్యుడు.. వీరికి తిరుగుడదు
గురు చండాల దోషం నుంచి విముక్తి.. వీరికి ఇక తిరుగే ఉండదు
గురు చండాల దోషం నుంచి విముక్తి.. వీరికి ఇక తిరుగే ఉండదు