Health Tips: గ్రీన్ టీ మాత్రమే కాదు, ఈ గ్రీన్‌ కాఫీ కూడా బరువు తగ్గించడంలో పవర్‌ ఫుల్‌..! ఒంట్లోని కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..!!

|

Oct 06, 2023 | 7:46 AM

గ్రీన్‌ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరానికి చాలా శక్తిని కూడా ఇస్తుంది. ఈ కాఫీలోని ఔషధ గుణాలు మీ బరువును తగ్గిస్తుంది. గ్రీన్‌ కాఫీ ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువ. అంతేకాకుండా, ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ కాఫీని ఒక ప్రత్యేకమైన కూరగాయల నుండి తయారుచేస్తారు. మీ స్పెషల్‌ డైట్‌తో పాటు గ్రీన్ కాఫీని ప్రయత్నించి చూడండి.. మీకు బెస్ట్‌ రిజల్ట్‌ ఉంటుంది. మీ ఒంట్లోని కొవ్వును వెన్నలాగా కరిగిస్తుంది.

Health Tips: గ్రీన్ టీ మాత్రమే కాదు, ఈ గ్రీన్‌ కాఫీ కూడా బరువు తగ్గించడంలో పవర్‌ ఫుల్‌..! ఒంట్లోని కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..!!
Broccoli Coffee
Follow us on

బరువు తగ్గడానికి గ్రీన్ టీ గురించి మనందరికీ తెలుసు, అయితే గ్రీన్ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా..? అవును.. బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు డైట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుకోవడానికి గ్రీన్ టీ, అనేక హెర్బల్ టీలను తాగటం మంచిదని చాలా మంది భావిస్తారు. ఇది ప్రయోగత్మకంగా కూడా చాలా మంది ప్రయత్నించి సక్సెస్‌ అవుతున్నారు కూడా. అయితే గ్రీన్ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ గ్రీన్ కాఫీ ప్రత్యేకంగా బ్రోకలీతో తయారు చేయబడింది. ఊబకాయాన్ని నియంత్రించడానికి గ్రీన్ కాఫీ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అధిక బరువు మీ శరీర ఆకృతిని కూడా పాడుచేస్తుంది. అందుకే మీరు బరువు తగ్గించుకోవడానికి రోజూ వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే, గ్రీన్ టీకి బదులుగా గ్రీన్ కాఫీ తీసుకోండి. అవును, ఈ గ్రీన్ కలర్ కాఫీని ఒక ప్రత్యేకమైన కూరగాయల నుండి తయారుచేస్తారు. మీ స్పెషల్‌ డైట్‌తో పాటు గ్రీన్ కాఫీని ప్రయత్నించి చూడండి.. మీకు బెస్ట్‌ రిజల్ట్‌ ఉంటుంది. మీ ఒంట్లోని కొవ్వును వెన్నలాగా కరిగిస్తుంది.

బ్రోకలీతో గ్రీన్‌ కాఫీ..

బ్రోకలీ కాఫీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..చాల మంది దీని పేరు కూడా వినుండరు. బ్రోకలీ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరానికి చాలా శక్తిని కూడా ఇస్తుంది. బ్రోకలీ కాఫీ బరువును తగ్గిస్తుంది. బ్రోకలీ కాఫీ ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువ. అంతేకాకుండా, ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. బ్రకోలీలో బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బ్రోకలీ కాఫీ ఎలా తయారు చేయాలి?

>> బ్రకోలీని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

>> తరిగిన బ్రకోలీని ఎండలో బాగా ఆరబెట్టండి.

>>బాగా ఆరిపోయిన తర్వాత దాన్ని మొత్తటి చూర్ణంగా తయారు చేసుకోవాలి.

>> పాలను వేడి చేసి అందులో బ్రోకలీ పౌడర్ వేసి తాగాలి.

మీకు కావాలంటే, ఇప్పుడు బ్రోకలీ పౌడర్‌ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిగా సహజమైనది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని రుజువు చేస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..