Breast Milk Jewelry: అమ్మ పాలు అమృతంతో సమానం అని అంటారు. అవును తల్లి పాలు బిడ్డకు శ్రేష్టమైనవి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి కనీసం ఆరు మాసాలైనా పాలివ్వాలి. ఎందుకంటే తల్లి పాలు అనేక పోషకాలకు నిలయం. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే.. అయితే తల్లి పాలతో నగలను కూడా తయారు చేస్తున్న ఓ మహిళ. ఇలా తల్లిపాలతో నగలు తయారు చేసి.. వాటిని ధరించడం వలన.. బిడ్డకు పాలిచ్చినప్పుడు కలిగిన అనుభూతిని జీవితాంతం గుర్తుంచుకుంటామంటూ చెబుతున్నారు. యుఎస్ కు చెందిన మహిళ తయారు చేస్తున్న ఆభరణాలను ధరిస్తున్నారు.. అయితే మళ్ళీ ఈ వార్త వెలుగులోకి వచ్చింది..యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా తన కూతురుకి చేయించిన ఉంగరం వలన.. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాకు చెందిన అల్మా పార్టిడా అనే మహిళ తన కూతురుకు సుమారు 18 నెలలు పాలు ఇచ్చింది. దీంతో తన కూతురికి పాలు ఇచ్చిన రోజులు.. అప్పుడు పొందిన మాతృత్వపు మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని రోజూ ఆలోచించేది. అనేక రకాలుగా మార్గాలను అన్వేషించింది. అప్పుడు అల్మా పార్టిడా దృష్టిలో తల్లిపాలతో నగలు తయారు చేసే కంపెనీ కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీపై పడింది. దీంతో వెంటనే తనకు తన పాలతో ఉంగరం కావాలంటూ ఆర్డర్ పెట్టింది. తల్లి పాలతో ఉంగరం తయారు చేయడానికి సదరు సంస్థకు తన పాలను 10 మిల్లీలీటర్లను పంపించింది.
నెల రోజుల తర్వాత కీప్‌సేక్స్ బై గ్రేస్ ఓ అందమైన ఉంగరాన్ని తయారు చేసి అల్మా పార్టిడాకు పంపించింది. ఆ ఉంగరాన్ని అల్మా పార్టిడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదే విషయంపై కీప్‌సేక్స్ బై గ్రేస్ యజమానురాలు మాట్లాడుతూ.. తాను మొదట ఇలా తల్లిపాలతో ఆభరణాలు చేసినప్పుడు అందరు ఎగతాళి చేశారని.. అయితే నగలను చూసిన తర్వాత ఇప్పుడు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. అయితే ఇలా తల్లిపాలతో నగలు తయారుచేయడానికి సదరు కంపెనీ రూ 4 వేల నుంచి రూ.11 వేల వరకు ఛార్జ్ చేస్తుంది. అయినా మహిళలు సంతోషంగా నగలను ఆర్డర్ ఇస్తున్నారు.
Also Read: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. దసరాలోపు కొత్త ఎస్టీపీల నిర్మాణం వేగం చేయాలన్న దానకిషోర్..