Breakup: ప్రేమ అనేది ఒక చెప్పలేని అనుభూతి. ఒకరి మీద ఒకరికి ఇష్టమున్న రోజులన్ని ఆనందంగా గడుస్తాయి. విడిపోయాకే పరిస్థితులు తారుమారవుతాయి. ప్రేమ అంటే అదొక సరికొత్త ప్రపంచం. ఇందులో మునిగి తేలుతుంటే కళ్లముందున్న ప్రపంచం కానరాదు. ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారో మాటల్లో చెప్పలేరు. కానీ విడిపోయినప్పుడు కూడా చాలా బాధని అనుభవిస్తారు. ప్రేమలో స్వార్థం, త్యాగం, నమ్మకం అన్ని కలగలిపి ఉంటాయి. ప్రేమలో ప్రతి క్షణం మధురమైనదే. ప్రతీది గుర్తించుకోవాల్సిన విశేషమే. అదే ప్రేమ దూరమైతే మాటల్లో చెప్పలేని నరకం, భరించలేని బాధ ఉంటాయి. ప్రేమలో విఫలమైన వ్యక్తులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. గర్ల్‌ఫ్రెండ్‌తో గడిపిన క్షణాలు, జ్ఞాపకాలను మరిచిపోలేకపోతారు. మునపటిలా గడపడం చాలా కష్టమవుతుంది. ఇందులో నుంచి బయటపడటానికి చాలామంది రకరకాల పద్దతులను అవలంభిస్తారు. అయితే చాలామంది ఈ నాలుగు పద్దతులని ఎక్కువగా పాటిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1) స్నేహితులతో సమావేశాలు
మీరు ఎవరినైనా ప్రేమించి తర్వాత విడిపోతే వారి జ్ఞాపకాలు అంత తొందరగా మరిచిపోలేరు. అందుకే బ్రేకప్ అయిన అబ్బాయిలు వాటిని వదిలించుకోవడానికి ఎక్కువగా స్నేహితులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విందు, వినోదాలలో పాల్గొంటున్నారు. దీంతో వారి మనస్సు కాస్త కుదుటపడుతోంది.
2. కొత్త విషయాలపై ఆసక్తి
బ్రేకప్ అయిన వ్యక్తులు తన ప్రియురాలి జ్ఞాపకాలని మరిచిపోవడానికి ఎక్కువగా కొత్త హాబీల వైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రేమలో ఉన్నప్పుడు వారు వదిలేసిన అభిరుచులు, కార్యకలాపాలు లేదా ఇతర విషయాల కోసం సమయం కేటాయిస్తున్నారు. ఒంటరితనం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. వంట నేర్చుకోవడం, వాయిద్యాలు వాయించడం, కొంతమంది క్రీడలు ఆడటం జరుగుతుంది.
3. పాత జ్ఞాపకాలను మరచిపోవడం
బ్రేకప్ అయిన తర్వాత ప్రియురాలి జ్ఞాపకాలను మరిచిపోవడం అంత సులువు కాదు. మనసులో ఆమెకి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అలవాటు ఉంటుంది. అవి కనిపించినప్పుడు వారు గుర్తుకువస్తారు. కాబట్టి చాలామంది వారి పాత జ్ఞాపకాలను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
4. సోషల్ మీడియాలో X ని బ్లాక్ చేయడం
బ్రేకప్ అయిన వ్యక్తులు తమ ప్రియురాలి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటారు. అందులో భాగంగానే చాలామంది మొబైల్ నుంచి ఆమె నెంబర్ డిలిట్ చేస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్లని అవైడ్ చేస్తారు. ఫోన్‌లో ఆమె ఫొటోలు, వీడియోలని డిలిట్ చేస్తారు. ఆమెకి సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని తన దగ్గర ఉంచుకోరు.