మీ పిల్లలు చదివిన వాటిని మర్చిపోతున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.. సమస్యకు చెక్‌ పెట్టండి!

ఈ మధ్య చాలా మంది పిల్లలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఎంత చదివినా గుర్తుండట్లేదు అని చెప్పడం. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడంతో పాటు వారి రోజువారి అలవాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. అయితే ఈ సమస్యకు ఇక పరిష్కారం లేదా అంటే ఉంది. మీరు కొన్ని అలవాట్లను వారు పాటించేలా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడడమే కాకుండా, వాళ్లు ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పిల్లలు చదివిన వాటిని మర్చిపోతున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.. సమస్యకు చెక్‌ పెట్టండి!
Enhance Child Memory

Updated on: Sep 14, 2025 | 4:51 PM

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన జ్ఞాపక శక్తి మెరుగు పడాలన్న మనశరీరానికి శక్తి కావాలన్న మనకు ఆహారం ఎంత ముఖ్యమో.. వాటిలో పాటు ఆరోగ్యమైన నిద్ర, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా పిల్లలో జ్ఞాపకశక్తి పెరగాలంటే వారు కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం పిల్లల మెదళ్ళు చాలా సరళంగా ఉంటాయి. కాబట్టి కొన్ని రోజువారీ అలవాట్లతో వారి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అవేంటనేవి పరిశీలిస్తే..

సరైన, ఆరోగ్యకరమైన నిద్ర

ముఖ్యంగా పిల్లలు నిద్రపోయినప్పుడు వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఈ నిద్ర పగటిపూట ఏర్పడే నాడీ సంబంధాలను బలపరుస్తుంది. అలాగే స్వల్పకాలిక అభ్యాసాన్ని దీర్ఘకాలిక జ్ఞానంగా మారుస్తుంది. స్కూల్‌ చదువుతున్న పిల్లలకు రోజూకూ కనీసం 9-11 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్‌లో 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ఆరోగ్యమైన నిద్ర అలవాటు ఉన్న పిల్లలు జ్ఞాపకశక్తి పరీక్షలలో మెరుగ్గా రాణించారని తేలింది.

పదే పదే చదవడం కంటే గుర్తుంచుకోవడం ముఖ్యం

పదే పదే చదువుతూ ఉండడం జ్ఞాపకశక్తిని ప్రభావవంత చేయదు. ఇలా పదే పదే చదవమనే బదులు తల్లిదండ్రులు ఒక సారి చదివిన తర్వాత వాటి సమాధానాలను గుర్తు చేసుకోమని పిల్లలకు చెప్పాలి. 2008లో సైన్స్‌లో ప్రచురించబడిన ఒక మైలురాయి అధ్యయనంలో, పుస్తకాన్ని చూడకుండా సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా చురుకైన జ్ఞాపకశని విద్యార్థులు పొందినట్టు గుర్తించారు.

ఆటలు, వ్యాయామం

శారీరక శ్రమ కండరాల పెరుగుదలకే కాదు, మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ప్రతిరోజూ 20-30 నిమిషాల పాటు పిల్లలు బయట ఆడుకోవడం ద్వారా వాళ్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నారు. న్యూరోసైన్స్ అండ్ బయోబిహేవియరల్ రివ్యూస్‌లో 2014లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఏరోబిక్ వ్యాయామం మన జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకాంపస్‌కు రక్త ప్రవాహాన్ని పెంచుతుందని తేలింది. దీని కారణంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

సరైన పోషకాహారం

మన ఆహార ఎంపికలు కూడా మన జ్ఞాపకశక్తిని నేరుగా ప్రభావితం చేస్తాయి. రోజూ తృణధాన్యాలు, రంగురంగుల పండ్లు, పుష్కలంగా నీరు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో 2016లో జరిగిన ఒక అధ్యయనంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (చేపలు, గింజలు, ఎండిన పండ్లు) అధికంగా ఉండే ఆహారం పిల్లలు, టీనేజర్స్‌లో జ్ఞాపకశక్తిని పెంచుతాయని తేలింది.

అందువల్ల, ఈ నాలుగు సూత్రాలను మీ పిల్లల రోజువారీ జీవితంలో అమలు చేయడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లలు కష్టపడి చదవడం కంటే, తెలివిగా చదవడానికి, జీవితాంతం జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.