ఆదివారం కాదా.. బోటి తెచ్చి వండుకోండి..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

సాధారణంగా ఆదివారం అంటే దాదాపుగా అందరి ఇళ్లలోనూ నాన్‌వెజ్‌ వంటకాలే ఎక్కువగా ఉంటాయి. చికెన్‌, మటన్‌, చేపలు ఇలా ఎవరికీ నచ్చిన మాంసాహారం వారు తెచ్చుకుని తింటారు. అయితే, కొందరు కోడిలోని వివిధ భాగాలు ఇష్టంగా తింటారు. అలాగే, మరికొందరు మేకపార్ట్స్‌ అంటే ఇష్టపడుతుంటారు. మేక తలకాయ మాంసం, కాళ్లు, మెదడు, లివర్‌, తిల్లి, బోటీ ఇలా అన్ని విడివిగా అమ్ముతారు. ప్రజలు కూడా వేటికవే ఇష్టంగా వండుకుని తింటూ ఉంటారు.. ఇక, అందులో దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అయితే, మేక బోటీతో చేసిన వంటకాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా..? అయితే, ఇది మీ కోసమే.

ఆదివారం కాదా.. బోటి తెచ్చి వండుకోండి..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Boti Curry

Updated on: Nov 23, 2025 | 1:23 PM

సాధారణ మాంసాహారం కంటే మేక బోటితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బోటిలో ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయంటున్నారు. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తహీనత తగ్గుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అందుకే నెలలో కనీసం రెండు సార్లు బోటి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బోటి కోలిన్ మంచి మూలం..ఇది మెదడు పనితీరును నిర్వహించడానికి ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది.. అంతేకాకుండా, మేక పేగులలో క్రియేటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బోటిలో విటమిన్ B12 కూడా అధికంగా ఉంటుంది. ఇందులో రోజువారీ తీసుకోవడంలో 65 శాతం ఉంటుంది. విటమిన్ B12 ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, కళ్ళు, కాలేయం మొదలైన వాటిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా కణజాల పనితీరుకు డిఎన్ఏ ఉత్పత్తికి కూడా బోటి ఎంతగానో దోహదం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. ఈ బోటిలో విటమిన్ A, విటమిన్ E వంటి కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలో సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కండరాల నిర్మాణం, దృఢత్వం, చర్మం ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైనవి. పైగా అధిక పోషకాలు కలిగిన బోటితో రోగ నిరోధక వ్యవస్థను బలపరచడం, అవయవాల పని మెరుగుపడడం జరుగుతుంది
కనుక కనీసం నెలలో రెండు మూడు సార్లు ఆయన బోటీ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..