Diabetes Diet: షుగర్‎తో బాధపడేవారికి వేసవిలో ఈ డ్రింక్స్ వరం లాంటివి.. రెగ్యులర్‌గా తీసుకోవాల్సిందే..

| Edited By: Janardhan Veluru

Mar 21, 2023 | 4:21 PM

మధుమేహవ్యాధిగ్రస్తులు అన్ని కాలాల్లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా వేసవికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Diabetes Diet: షుగర్‎తో బాధపడేవారికి వేసవిలో ఈ డ్రింక్స్ వరం లాంటివి.. రెగ్యులర్‌గా తీసుకోవాల్సిందే..
Summer Drinks
Follow us on

మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని కాలాల్లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా వేసవికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండాకాలంలో షుగర్ రోగుల రోగనిరోధకశక్తి బలహీనంగా ఉంటుంది. ఇది వ్యాధి ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఈ సీజన్లో పాదరసం చాలా వేగంగా పెరగుతుంది. దీని కారణంగా డయాబెటిక్ రోగులు చాలా హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, అలసటకు గురవుతుంటారు. డయాబెటిక్ రోగుల రక్తలో షుగర్ లెవెల్స్ వేడి వాతావరణంలో కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకునేందుకు వేసవిలో డీ హైడ్రేషన్ నివారించేందుకు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం.

మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కూలింగ్ డ్రింక్స్

1. నీరు:

షుగర్ నియంత్రణలో ఉండాలంటే వేసవిలో దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలి. అలాగే కొన్ని రకాల ప్రత్యేక పానీయాలుకూడా తీసుకోవడం చాలామంచింది. నియంత్రణలేని రక్తంలో చక్కెర స్థాయిలు నిర్జలీకరణానికి దారితీస్తాయి. తగినంత నీరు త్రాగడం వల్ల మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ని వదిలించుకోవడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, గరిష్ట ఆర్ద్రీకరణ కోసం పుష్కలంగా నీరు త్రాగాలి. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు.

ఇవి కూడా చదవండి

2. చక్కెర లేకుండా నిమ్మరసం:

వేసవిలో నిత్యావసరాలలో నిమ్మరసం ఒకటి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, చక్కెర లేకుండా నిమ్మరసం తాగేందుకు ప్రయత్నించండి. ఇందులో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు ఉత్తమమైంది.

3. కూరగాయల జ్యూస్:

పండ్ల రసాల్లో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. అందువల్ల, కూరగాయల రసం తాగినట్లయితే అందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఉప్పు, చక్కెరను కలుపుకోవద్దు. కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహరోగులకు అత్యంత ప్రయోజకరంగా ఉంటుంది.

4. కొబ్బరి నీరు:

కొబ్బరి నీరు హైడ్రేటింగ్, రిఫ్రెష్ ,పోషకమైనది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, చాలా తక్కువ సహజ చక్కెర కంటెంట్ కలిగి ఉంటుంది. కొబ్బరి నీళ్లలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగవచ్చు.

5. మజ్జిగ:

ఈ దేశీ ఇండియన్ సూపర్ డ్రింక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో పేగు ఆరోగ్యాన్ని పెంచే గొప్ప ప్రోబయోటిక్ ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కొవ్వు పదార్థం, తక్కువ కేలరీలు కలిగి ఉన్నందున ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలు, సోడాలు, ఆల్కహాలిక్ పానీయాలు, ఇతర ప్యాక్డ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..