Health Tips: నల్లగా ఉందని చులకనా చూడకండి.. రోజూ పరగడపున తిన్నారో బెబ్బులి లెక్కనుంటారు

|

Dec 16, 2024 | 8:25 PM

ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో వెల్లుల్లి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. వీటిని వంటకాల్లో వేస్తే ఆ రుచే వేరబ్బ. ఇవి వంటలకు రుచినే కాదు.. వీటిని తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది..

Health Tips: నల్లగా ఉందని చులకనా చూడకండి.. రోజూ పరగడపున తిన్నారో బెబ్బులి లెక్కనుంటారు
Black Garlic
Follow us on

రోజువారీ వంటలలో ఉపయోగించే వెల్లుల్లి ఆహారానికి సువాసన మాత్రమే కాకుండా రుచిని మెరుగుపరచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తెల్ల వెల్లుల్లి మాదిరిగానే.. బ్లాక్ వెల్లుల్లిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచి తక్కువగా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం దండిగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది

బ్లాక్ వెల్లుల్లిని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ స్థాయి మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారిస్తుంది. గర్భధారణ సమయంలో మధుమేహాన్ని నివారిస్తుంది.

గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది

నల్ల వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. నల్ల వెల్లుల్లిలో అల్లిసిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించడం ద్వారా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఉదయం పూట ఖాళీ కడుపుతో నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. క్యాన్సర్ వంటి సమస్యల విషయంలో దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చికిత్సలో సానుకూల మార్పు వస్తుంది.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది

నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారించవచ్చు. ఇందులోని పోషకాలు ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బ్లాక్ వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నల్ల వెల్లుల్లి శరీరానికి సంబంధించిన సమస్యను మాత్రమే కాకుండా మానసిక సమస్యలను కూడా తొలగిస్తుంది. నల్ల వెల్లుల్లి డిమెన్షియా, డిప్రెషన్ వంటి సమస్యలను నయం చేస్తుంది. మెదడును పని తీరును మెరుగుపరుస్తుంది.

కాలేయ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది

కాలేయ సమస్యలను తగ్గించడంలో నల్ల వెల్లుల్లి పాత్ర కీలకం. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయం డిటాక్సిఫై చేయబడి కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.