Black Coffee: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఇకపై ఇదే కంటిన్యూ అవుతారు..!

|

Mar 05, 2024 | 1:45 PM

కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. కెఫిన్ అనేది మన మెదడు, నాడీ వ్యవస్థను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడంలో సహాయపడే సహజ ఉద్దీపన. ఇది మన శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Black Coffee: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఇకపై ఇదే కంటిన్యూ అవుతారు..!
Black Coffee
Follow us on

Black Coffee Health Benefits: చాలా మందికి టీ-కాఫీ తాగందే పని జరగదు. మన దేశంలో ఎక్కువ మందికి టీ-కాఫీలంటే చెప్పలేనంత ఇష్టం..ప్రతిరోజూ ఉదయం కప్పు కాఫీ, టీ కడుపులో పడితే గానీ, బండి కదలదు. ఆ తర్వాతే వారి రోజువారీ దినచర్య ప్రారంభమవుతుంది. తలనొప్పి, టెన్షన్ నుండి ఉపశమనం పొందడానికి కాఫీ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ పాలు, పంచదార కలిపి చేసిన కాఫీ ఆరోగ్యానికి హానికరం అంటూ నిపుణులు పదేపదే చెబుతున్నారు. బదులుగా, మీరు బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని సూచిస్తున్నారు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1. తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది: యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, ఒక కప్పు బ్లాక్ కాఫీలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. మీరు కెఫిన్ కలిగిన బీన్స్ ఉపయోగిస్తే మీ కాఫీలో కేలరీల సంఖ్య సున్నా అవుతుంది. అందువల్ల, మీరు బ్లాక్ కాఫీని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

2. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది: బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీని వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తి ఆలస్యమై కొత్త కొవ్వు కణాలు ఏర్పడటం తగ్గుతుంది. అప్పుడు బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

3. శరీరానికి శక్తినిస్తుంది: కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. కెఫిన్ అనేది మన మెదడు, నాడీ వ్యవస్థను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడంలో సహాయపడే సహజ ఉద్దీపన. ఇది మన శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..