చేదుగా ఉంటుంది కానీ.. ఈ 2 రోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే అరకప్పు తాగితే..

ప్రపంచవ్యాప్తంగా.. డయాబెటిస్, యూరిక్ యాసిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి... ముఖ్యంగా మన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు యూరిక్ యాసిడ్, డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ఈ కూరగాయ రసాన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా.. వాటిని అదుపులో ఉంచుకోవచ్చు..

చేదుగా ఉంటుంది కానీ.. ఈ 2 రోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే అరకప్పు తాగితే..
Bitter Gourd Juice Benefits

Updated on: Jan 27, 2026 | 3:14 PM

భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా.. డయాబెటిస్ కేసులు పెరిగిపోతున్నాయి… ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా.. లక్షలాది మంది మధుమేహ బాధితులుగా మారుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అంతేకాకుండా, యూరిక్ యాసిడ్ రోగుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ రెండు వ్యాధులు జీవనశైలికి సంబంధించినవి.. ముఖ్యంగా మీరు తీసుకుంటున్న ఆహారం ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం మధుమేహాన్ని పెంచుతుంది. దీని కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

యూరిక్ యాసిడ్.. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల, దానిని సకాలంలో నియంత్రించడం చాలా ముఖ్యం. దీని కోసం, మందులతో పాటు, మీరు మీ ఆహారంలో కాకరకాయ రసాన్ని చేర్చుకోవాలి. కాకరకాయ రసం తాగడం వల్ల ఈ రెండు వ్యాధులు అదుపులో ఉంటాయి. ఈ కూరగాయ యూరిక్ యాసిడ్, డయాబెటిస్‌లో ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..

ఒక గ్లాసు కాకరకాయ రసం సహజంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి తో పాటు కాల్షియం, బీటా-కెరోటిన్, పొటాషియం మొదలైనవి మంచి మొత్తంలో ఉంటాయి. ఈ అంశాలు గౌట్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

మధుమేహం ఉన్నవారికి కాకరకాయ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కాకరకాయలో విటమిన్ ఎ, సి, విటా-కెరోటిన్, ఇతర ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.. దీని కారణంగా ఇది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది.. పెరుగుతున్న చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది.

మీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో అర కప్పు కాకరకాయ రసం తాగవచ్చు. ఆ చేదును తొలగించడానికి, మీరు కొద్దిగా నల్ల ఉప్పు లేదా నిమ్మరసం జోడించవచ్చు. దీనిని తాగడం గౌట్, ఆర్థరైటిస్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే, మీరు కాకరకాయ రసంతో పాటు వివిధ రకాల పదార్థాలను తయారు చేసుకుని తినవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. మీ ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..